Others

చెప్పేశాడు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెళ్లికి రెడీగానే ఉన్నాను. కాకపోతే -అమ్మాయివైపు నుంచే ఇంకా క్లియరెన్స్ రాలేదు -అంటున్నాడు హీరో రాజ్‌తరుణ్. ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నానంటూ ఈమధ్య గుట్టువిప్పిన రాజ్‌తరుణ్, వచ్చే ఏడాది పెళ్లి పీటలెక్కే అవకాశం లేకపోలేదంటూ చెప్పకనే చెబుతున్నాడు. ఇంతకాలం లవర్ డీటెయిల్స్‌ను సీక్రెట్‌గా ఉంచిన రాజ్‌తరుణ్, తాజాగా ఆమె సమాచారానికి సంబంధించి కొన్ని క్లూలు ఇస్తున్నాడు. తాజాగా ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ ఎక్కడి అమ్మాయి? ఎలా పరిచయమైంది? తదితర విషయాలను పంచుకున్నాడు. ‘ఆమెకు చిత్ర పరిశ్రమతో సంబంధం లేదు. కానీ, ఆరేళ్లుగా ప్రేమలో ఉన్నాం. ఆమె తెలుగమ్మాయే. ఇంకా కావాలంటే -ఆమెది విజయవాడ. ఓ వ్యాపారవేత్త కుమార్తె. ఇక పరిచయమంటారా.. విశాఖలో నా బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో ఓసారి చూశా. నచ్చింది. మాట కలిసింది. అభిరుచులు కలిశాయి. అవి -ప్రేమగా చిగురించి కొనసాగుతున్నాయి. చాలా సందర్భాల్లో ఇద్దరం కలుస్తుంటాం. జీవితాంతం ఒకరికొకరం అనే ఫీలింగ్‌లో ఉన్నాం’ అంటూ గుట్టు విప్పేశాడు రాజ్‌తరుణ్. పేరెంట్స్ పెళ్లికి అంగీకరించారని, తాను ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నా ఆమెనుంచి ఆలస్యమవుతోందని అంటున్నాడు రాజ్‌తరుణ్. ‘ఏమో, బహుశ వచ్చే ఏడాది పెళ్లి పీటలు ఎక్కుతామేమో’ అన్నది రాజ్‌తరుణ్ సమాధానం.