Others

సైనికులకు రాఖీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సైనికులను వినూత్న రీతిలో గౌరవించాలని ప్రధాని మోదీ పిలుపునివ్వడంతో కేంద్ర క్యాబినెట్‌లోని మహిళా మంత్రులు దేశ సరిహద్దులకు పయనమవుతున్నారు. సరిహద్దుల్లో సైనికుల వద్దకు స్వయంగా వెళ్లి ‘రక్షాబంధన్’ సందర్భంగా వారికి రాఖీలు కట్టాలని మహిళా మంత్రులను ప్రధాని ఆదేశించారు. ఈ నెల 18న రక్షాబంధన్‌ను పురస్కరించుకుని మహిళా మంత్రులు సుష్మా స్వరాజ్, స్మృతి ఇరానీ, మేనకా గాంధీ, ఉమాభారతి, నిర్మలా సీతారామన్, సాథ్వి నిరంజన్ జ్యోతి, అనుప్రియా పటేల్ నేరుగా సైనికుల వద్దకు వెళ్లి రాఖీలు కట్టి మిఠాయిలు అందజేస్తారు. సియాచిన్ బేస్ క్యాంప్ వద్దకు కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ వెళ్లి సైనికులకు రాఖీలు కడతారు. రాజస్థాన్‌లో జైసల్మేర్ సరిహద్దుకు అనుప్రియా పటేల్, పంజాబ్‌లో దేశ సరిహద్దు వద్దకు మేనకా గాంధీ వెళ్లి సైనికులతో కలసి రక్షాబంధన్ వేడుకల్లో పాల్గొంటారు. మిగతా మహిళా మంత్రులు కూడా వివిధ సరిహద్దు ప్రాంతాలకు వెళ్లి సైనికులను కలుసుకుంటారు.