Others

కొల్లాజెన్‌ను పెంచే మాస్క్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతిరోజూ మనం ఎదుర్కొనే మురికి, ధూళి, కాలుష్యం కారణంగా చర్మ సంరక్షణ అనేది అత్యంత క్లిష్టతరం. మనం తరచుగా ప్రభావిత ప్రాంతాలను శుభ్రం చేయడం, బ్లీచ్ చేయడం, ఫేషియల్ చేయించుకోవడం వంటి సౌందర్య చికిత్సలను అనుసరించడం ద్వారా కొన్ని చర్మ సమస్యలకు దూరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ వీటికోసం తరచుగా వివిధ రకాల స్పా, సెలూన్లను సందర్శిస్తుంటాం. ఇవి ఖర్చుతో కూడిన వ్యవహారంగా ఉన్నా, నమ్మదగిన ఫలితాలను మాత్రం ఖచ్చితత్వంతో ఇవ్వలేవు. వాస్తవంగా ఈ సెలూన్ ఆధారిత చికిత్సలు, మీ చర్మానికి హాని కలిగించే రసాయనాలతో కూడిన పదార్థాలను కలిగి ఉంటాయి. మరి అలాంటప్పుడు మనం సులభతరమైన, సరళమైన, ఇంట్లో తయారుచేసుకునే ఫేస్‌ప్యాక్‌లను వేసుకోవడం చాలా చాలా ఉత్తమం. అంతేకాకుండా దుష్ప్రభావాలు లేని చికిత్సను అందించగలిగి, ఆరోగ్యకర చర్మాన్ని నిర్వహించేందుకు అనువుగా ఉంటుంది. సహజ సిద్ధమైన పదార్థాలను ఉపయోగించి తయారుచేయగలిగిన కొన్ని అద్భుతమైన ప్రకృతిసిద్ధమైన, ఇంట్లో తయారుచేసుకునే ఫేస్‌ప్యాక్స్‌ను చూద్దాం. మచ్చలేని, నిష్కళంక చర్మాన్ని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అలాంటివారి కోసమే ఈ ఫేస్‌ప్యాక్స్..
అవకాడోతో..
ఒక గినె్నలోకి రెండు చెంచాల అవకాడో గుజ్జు, రెండు చెంచాల టొమాటో గుజ్జు, ఒక చెంచా కోడిగుడ్డులోని తెల్లసొనలను తీసుకోవాలి. వీటిని బాగా కలుపుకుని ముఖానికి, మెడకు పట్టించాలి. పదిహేను నిముషాలపాటు వీటిని అలాగే వదిలేయాలి. తరువాత చల్లటి నీటితో కడిగి, మెత్తటి తువాలుతో తుడిచేయాలి. దీన్ని వారానికి ఒకసారి చేస్తే ముఖం తేటగా, అందంగా ఉంటుంది. అవకాడో నేచురల్ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తూ హైడ్రేటెడ్ గుణాలను కలిగి ఉంటుంది. దీనిలోని బీటాకెరోటిన్, లినోలెయిక్ ఆమ్లం, లెసితిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్న కారణంగా ఇది చర్మాన్ని నిర్జలీకరణం కాకుండా చూస్తూ మంచి పోషణను ఇవ్వగలుగుతుంది. ఇది చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడానికి, తేమను నిర్వహించడంతో పాటు మంచి పోషణను అందించడానికి టొమాటో, కోడిగుడ్డు తెల్లసొన పనిచేస్తుంది.
దాల్చిన చెక్కతో..
ఒక గినె్నను తీసుకుని అందులో ఒక చెంచా దాల్చిన చెక్కపొడి, ఒక చెంచా తేనె, చిటికెడు పసుపులను వేసి బాగా కలపాలి. దీన్ని ముఖానికి, మెడకు పూసి పదిహేను నిముషాల నుండి ఇరవై నిముషాల పాటు అలాగే వదిలేయాలి. తరువాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. దీన్ని వారానికి రెండుసార్లు చేయడం వల్ల మంచి ఫలితాన్ని పొందవచ్చు. దాల్చిన చెక్కలోని యాంటీ మైక్రోబయల్, యాంటీ ఇన్ల్ఫమేటరీ లక్షణాలు మొటిమలు, ఆక్నే సమస్యను తగ్గించడంలో సహాయపడతాయి. మరోవైపు తేనె, పసుపు హానికరమైన ఫ్రీరాడికల్స్ నుండి చర్మాన్ని రక్షిస్తుంది. తద్వారా కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది.
అరటితో..
ఒక గినె్నలోకి చెంచా పెరుగు, రెండు చెంచాల అరటిపండు గుజ్జు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడపైన రాసుకోవాలి. ఇరవై నిముషాల పాటు అలానే వదిలేసి తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. పెరుగు చర్మానికి ప్రయోజనకరంగా ఉండే అనేక విటమిన్స్, పోషకాలను కలిగి ఉంటుంది. ఇది లాక్టిక్ ఆమ్లాన్ని ప్రధానంగా కలిగి ఉంటుంది. ఇది చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో వినియోగించే ప్రధాన పదార్థాల్లో ఒకటిగా ఉంటుంది. పెరుగు, ఫేస్‌మాస్క్ రూపంలో పూసినప్పుడు చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేసి ప్రకాశవంతంగా, కాంతివంతంగా మార్చగలుగుతుంది. అదేవిధంగా దీన్ని వారానికి రెండుసార్లు పూయడం వల్ల చర్మంలోని కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడంలో ఉత్తమంగా సహాయపడుతుంది. *