Others

నేర్పు అవసరమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భగవంతుడు సర్వాంతర్యామి. వస్తువులోను, అవస్తువులోను పరమాత్మ వుంటాడన్న సత్యం అపుడపుడూ బహిర్గ మవు తూనే ఉంది. కలియుగం లోను వింతలు మాయలు అంటూ ఉన్నా దైవం అవ్యక్తమైనా అక్కడక్కడా వ్యక్త వౌతునే ఉన్నాడు. మన లోని దుష్టబుద్ధిని దూరం చేసుకొని సజ్జనులుగా ఉండమని, సాత్విక బుద్ధిని ఏర్పరుచుకోమని భగవం తుడు ఎన్నో అవతా రాలు దాల్చి చెప్పాడు. ఆనాడు గజేంద్రుడు ఎలుగెత్తి అరిచినట్టు గానే లోపలా, వెలుపలా అంతటా నేనే నిండి ఉన్నాను. నీవు కూడా నాలోనే ఉన్నావు అని ప్రతి విషయంలోను బోధిస్తునే ఉన్నాడు. కానీ నేను అనే అహం కారం, ఆత్మ అనే జ్ఞానాన్ని తెలుసు కోలేని అజ్ఞానం ఈ శరీరమే నిత్యమని, ఆరోగ్యం గా ఉంటూ ఉంటే ప్రాణం ఈ శరీరంలోనే ఉండి ఉంటుందని శ్రమిస్తే అపోహ పడుతూ ఉంటారు. ప్రకృతికి విరు ద్ధంగా నడుస్తూ సంతోషాన్ని వెతుక్కుం టూ ఉంటారు. ప్రకృతి పశుపక్ష్యాదులన్నీ మనిషికి ఆదర్శంగా కనిపిస్తున్నా సరే వాటి ని గమనించకుండా తరతరాలకు తరగని ఆస్తిని పోగు చేస్తే రాబోయే తరాలు కూర్చుని తింటాయని ముందే కలలు గంటు ఉంటాడు. అవి నిజమవుతాయో లేదో కూడా తెలియని మానవుడు.
అన్నీ తెలిసినా, విచక్షణ , విజ్ఞానం, వివేకం అన్నీ ఉన్నా కూడా మాయా మోహితుడై మెలిగే మనిషిని చూసి భగవంతుడు ఎప్పటి కప్పుడు అన్నీ తానై అయ కూడా మనిషిని నీవు చెప్పేదంతా క్షణికమే నీవు చూసే దంతా మిథ్యే అని చెబుతూ ఉంటాడు.
కానీ మనిషి మాత్రం ఆ భగవంతుని మాట నుస్వరాన్ని వినడు. తనకు తోచిన రీతిలో చేస్తూ మానవ ప్రయత్నం ఉండి తీరాలి అనే ధర్మసూక్ష్మాన్ని కూడా ఉటంకి స్తాడు. విజయం వస్తే మాత్రం నేను కష్టపడి ఎన్నో యాతనలు పడి సాధించి తీరాను అంటాడు. అదే అపజయం వస్తే కాసేపు భగవంతుడు తనకు మేలు చేయలేదని తాను ఎన్నో పుణ్యకార్యాలు చేసినా పాపకార్యాలకు చేసేవారికి సహాయం చేశాడని వాపోతాడు.
ఇంతకీ ఏది నిజం అన్నది మాత్రం తెలుసుకోలేడు. తాను ఎక్కడ నుంచి వచ్చాడో తాను ఎక్కడికి వెళ్తున్నాడో కూడా చూడడు. తన చుట్టూ నశించిపోయే ఉన్నా యని తెలిసినా నశించని దాని గురించి ఏమాత్రం జాగ్రత్త వహించడు.అందుకే భగ వంతుడు కోటి మంది ఉపన్యాసం వినడానికి కూర్చున్నా, అందులో వినే వారెంతమందో, విన్నా ఆచరించేవారెం దరో ఆచరిం చినా అందులో నన్ను తెలుసుకొనే వారు ఒక్కరే ఉంటారేమో అన్నాడు.
అందుకే అంతా భగవంతుడే అన్ని మనసా వాచా కర్మణా నమ్మి అన్నీంటినీ ఈశ్వరార్పణం చేస్తూ పనులు చేస్తే అను కొన్న ఫలితాలను పొందవచ్చు. నిజమైన పరంధా మానికి చివరకు చేరవచ్చు. మన కళ్ల ఎదుట జరిగేదంతా నిజం కాకపోవచ్చు.. మనకు తెలియ లేనంత మా త్రం నిజం లేకుండాను పోదు. అందుకే ఏది చేసినా కర్తకర్మక్రియ భగవంతుడే అని మనస్ఫూర్తిగా నమ్మి పనులు చేయాలి. ఫలితం అనుకూలంగా వచ్చినా, ప్రతి కూలం గా వచ్చినా ఒకే విధంగా వచ్చినా ఉండే సమభావాన్ని, సమదృష్టిని అలవర్చు కోవాలి. మానవసేవనే మాధవ సేవగా పరిగణించి పనులు చేయాలి. నరుల్లో నారాయణుడు ఉంటాడని నమ్మితీరాలి. అపుడే పరులు పరమాత్మస్వరూపాలు గా కనిపిస్తారు.

- కూచిబొట్ల వెంకటలక్ష్మి