Others

ఆగస్టు 15

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముసలితాత యొకడె మోహరమ్మును మాని
సత్య ధర్మ పథము సాగజేయ
లీల వెలిగి పంచశీల సూత్రమ్ముల
తెలిపి నెహ్రూ జాతి వెలుగజేయ
జైహిందటంచును సైనిక మూర్తి యా
నేతాజి సింహమై నిదురలేప
ఉక్కుమనిషి యంచు మిక్కిలి యశమంది
యా పటేలు కలత బాపజేయ

అనిబిసెంటు రాజేంద్రుడు వినయశీలి
మోతిలాలును కృపలనీ నీతిధనులు
సర్వమర్పింప నింగిపై జాబిలనగ!
ఈ త్రివర్ణ పతాకమ్ము ఎగురుచుండె

భారతమాత శీర్షమున భాసిలినారు మణీ విభాసులై
కారణ జన్ములై కవులు జ్ఞానులు నేతలు ధర్మతేజ మం
దారు లగష్టు విప్లవ ప్రధానులునై, గణనీయ మూర్తులై
వారి కృపావలోకనమె భారత జాతికి స్వేచ్ఛ సోదరా!

రంగదనూన శోభ లలరంగ వెలింగె త్రిలింగకేతనో
త్తుంగ తరంగ భంగిమలు దోయిలి యెగ్గుడు భారతాంబకున్
ముంగిలి ముత్యముల్ మెరయ మ్రుగ్గు లమర్చుడు స్వాగతాంజలుల్
నింగి ప్రతిధ్వనింపగ ధ్వనింపగ జేయుడు చెంగలింపగన్

- మద్దూరు రామ్మూర్తి