Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏళ్ళు గడిచె కాని యతడు- కన్నైనను తెరువడు
యుగమే గడిచెను కానీ పెదవి విప్పబోడు.

వారి పెళ్ళిసేసి లోకకల్యాణం నెరపు కొరకు
రతీమన్మథులు జంటగ నేతెంచిరి యటకు.

ఒక చంద్రుడు ఒక వెనె్నల ఒక జంటగ వచ్చిరనగ
వచ్చినారు వారచటకు వసంతమ్మె వచ్చెననగ.

మోడులెల్ల పులకరించి పూలనెత్తుకొని కులికెను
ఆ తావులు తావులతో హృద్యమ్మై తోచెను.

నాట్యమూర్తి మ్రోలవారు- ఒకటై నర్తించినారు
అతని ఆత్మ అతని ఎదుటె- ఆడెననగ ఆడినారు.

సరసవ్మౌ చెఱకు విల్లు పూనె నరసుడైన వాడు
నవ్వెడి పువ్వుల శరముల శిశువునిపైన రువ్వినాడు.

పూల తాకిడికి నొచ్చెనొ? శివుడెంతటి సుకుమారుడొ?
గ్రుచ్చిగ్రుచ్చి చిచ్చుకంట విచ్చి చూచినాడు.

కుసుమ శరమ్ముల వేసిన కుసుమాంగుని పైనాతడు
కురిపించెను అగ్గివాన- హరుడెంతటి కఠినాత్ముడొ?

‘భగభగమని ‘భగభుగ’మని- లేచెనంత పెనుమంటలు
భూమ్యాకాశములొకపరి తగులబడియె నన్నట్టుల.

విల విల్తుని ప్రాణమ్ములు ఆవిరులై పోయెను
తావులు గుప్పించువాడె తావు వీడి పోయెను.
ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087