Others

ఏకాదశ సూత్రాలు.. అంతరార్థాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శిరిడీ సాయ బాబా అపుడపుడు తన దగ్గరకు వచ్చిన వారికి చెప్పిన నీతులే ఏకాదశ సూత్రాలు. వీటిని ప్రతిరోజు ఓసారి మనసారా మననం చేసుకొంటే బాబా తత్వం అర్థమవుతుంది. అపుడే మనిషిలోని అంతర్యామిని అనే్వషించే నేర్పు కలుగు తుంది. భిక్షాటనలో బాబా తెచ్చిన భిక్షను అంతా కలిపి ముందు కాస్త పక్షులకు, తన దగ్గరే ఉండే నల్లకుక్కకు, చీమలకు దోమలకు పెట్టేవాడు. ఆ తరువాత భక్తులకు పెట్టేవాడు. అపుడు చివరకు మిగిలింది తాను తినేవాడు. దీనే్న ప్రతి మహిళ అర్థం చేసుకొంటే లోకంలో అన్నంకోసం అలమటించే వారి సంఖ్య తగ్గిపో తుంది. షిరిడి ప్రవేశమే సర్వదుఃఖపరిహారం, ఆర్తులైననేమి, నిరుపేదలైననేమి, ద్వారకామాయి ప్రవేశమొనరించినంతనే సుఖ సంపదలందగలరు అని అంటారు. నిజమే కదా. భగవంతుని సన్నిధానానికి చేరిన తరువాత కూడా చింతలెందుకు ఉంటాయ? ప్రతి ఇల్లు భగవంతుని నివాసంగా మార్చుకోవడం అందులో నివసించేవారి చేయవలసిన పని. ఇంటికి వచ్చిన వారిని ఆదరించడం, వారికి కావాల్సింది చూడడం, గృహస్థుబాధ్యత. ఇంట్లో ఉండేవారంతా కలసి మెలసి ఐకమత్యంతో ఉండడం ఉన్నదేదో కలసి తినడంపొరపొచ్చాలకు తావు లేకుండా చేయడం ఇంటిలోని అందరి బాధ్యత అపుడే ఆ ఇల్లు ఆనందనందనం అవుతుంది. తన దగ్గర కు వచ్చే భక్తుల్లో కోపం, అసూయ, ఈర్ష్య ఉన్నా వాటిని శిరిడీ బాబా వారికి చిన్న చిన్న కథలు చెప్పో లేక కొన్ని పనులను వారిచేత చేయంచడం ద్వారానో వారిలో మార్పు తెచ్చేవారు. అట్లానే ఎదుటి వారిని చూసో లేక శిరిడి బాబా చెప్పిన మాటలను మననం చేసుకొనే అందరూ వారివారి ఇండ్లను బాబా నివాసాలుగా మార్చుకోవాలి.
ఈ భౌతిక దేహానంతరం సైతం నేనప్రమత్తుడనే, నా భక్తుల రక్షణ నా సమాధి నుండియే వెలువడును. నా సమాధినుండియే నేను సర్వకార్యములు నిర్వహింతును. నా సమాధి నుండి నా మానుష శరీరము మాటలాడును. నన్నాశ్రయించువారిని, నా శరణుజొచ్చినవారిని నిరంతరము రక్షించుటయే నా కర్తవ్యం. నాయందెవరికి దృష్టిగలదో, వారియందు నా కటాక్షము కలదు. మీ భారములను నాపైబడవేయుడు, నేను మోసెదను. నా సహాయముగాని సలహానుగాని కోరినచో తక్షణమే ఇద్దును. నా భక్తుల గృహములయందు లేమియను శబ్దము పొడసూపదు.
ఆనాడు కృష్ణుడు గీత ద్వారా ఇదే చెప్పాడు. అంటే నాటి కృష్ణుడు నేటి బాబా ఇద్దరూ ఒకటే. ఆ కృష్ణయ్య నీవు నీ కర్తవ్యాన్ని పాటించు. నేను నీకు ఏఫలితం ఇవ్వాలో దాన్ని తప్పక ఇస్తాను నీ నమ్ము నీ యోగ క్షేమాలను నేను చూస్తాను అన్నాడు కదా. భగవంతుని నమ్మినవారికి చెడుగు ఏముంటుంది. అంతా భగవంతుడే అనుకొని చేసే కార్యాలను సత్ఫలితాలనే ఇస్తాయ. వాటి వల్ల ఆనందం తప్ప దుఃఖానికి చోటు ఉండదు కదా. మరిఅట్లా జరగాలంటే మనఇల్లే కాదు మన మనసు భగవంతుని ఆవాసం అయ ఉండాలి కదా. భగవంతుని మారురూపులుగా మారితే ఇక అంతాధర్మమే జరుగుతుంది. ఆ ధర్మమే మనలను తప్పక రక్షిస్తుంది. కనుక బాబా చెప్పిన మాటలను అర్థం చేసుకొని జీవితాలను ప్రకాశవంతం చేసుకోవాలి.
బాబా చెప్పిన మాట ఎంత గొప్పదో.. మానవులుగా మనమే ఆలోచించాలి. బాబా చెప్పిన మరో గొప్ప మాట శ్రద్ధ, సబూరీ. మనం ఏమి చేసినా ఏ పని చేసినా శ్రద్ధ చాలా అవసరం. ఈ శ్రద్ధనుఎపుడూ మరవకూడదు. శ్రద్ధ తగ్గితే ఏకాగ్రత దెబ్బతింటుంది. దానితో చేసే పనిలో నైపుణ్యం కనిపించదు. అంతా అస్తవ్యస్తం అవుంతుంది. అందుకే బాబా ఓరిమి శ్రద్ధ రెండూ ప్రతి జీవికి కావాలంటారు. ముందు వాటిని అలవర్చుకుంటే బాబా మనదగ్గర ఉన్నట్లే.

- జి. కృష్ణమూర్తి