Others

మోక్ష సన్యాస యోగము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేహ ధర్మములను, లోక ధర్మములను, శాస్తధ్రర్మములను విడనాడి, ఒకకాళీమాతనే శరణు పొందిన కారణమున రామకృష్ణునకు ఆ దేవి దర్శనమిచ్చెను. ఆకలిదప్పులను చూచుకొనలేదు. లోకులేమనుకొందరో అను భయమును పోగొట్టెను. ప్రేమ పూజయే చేసెను గాని, మడి, విధి చూడలేదు. భగవంతుని గూర్చి ఏడ్చుట తెలియనివారాయన. ఏడ్చుట చూచి ఆశ్చర్యపడి పిచ్చివాడనిరి. దేహమే బంగారముగా చూచుకొనువారందరు ఆయనను వెర్రివాడనిరి. శాస్తమ్రే ప్రధానముగా చూచువారాతనిని భ్రష్టుడనిరి.
కాని, ఆయన పట్టువిడనాడక చేయు ధ్యానములలో పాలు పంచుకొనలేకపోయిరి. ఆయన యిట్లు చెప్పెను. ‘‘ప్రక్క గదిలో బంగారమున్నదని తెలిసిన ఏ దొంగవానికి నిద్రపట్టును? ఏ దొంగవానికి మనస్సు దానియందు లగ్నము కాదు? అట్టివానికి బంగారముపై పిచ్చి పట్టదా? అది లభించువరకు ప్రాణములైన నీయుటకు సిద్ధపడును గదా. అట్టిదే నా స్థితి! రామకృష్ణ పరమహంస గాని, రమణ మహర్షిగాని భగవంతునిపై మనస్సు ఏకాగ్రపరచి ధ్యాననిష్ఠలో ఉన్నపుడు వారిపై సర్పములు ప్రాకినను వారికి తెలియదు.
కేవలం దేహేంద్రియములనే చలింపనీయక కొన్నాళ్ళు అభ్యాసము చేసినచో మనస్సు కూడా స్వాధీనమగును. తరువాత మనస్సును ఒక నామమునందుగాని, ఒక రూపమునందు గాని అభ్యాసపరచవలెను. క్రమక్రమముగా ఇతర ధర్మములన్నియు జారగలవు. శ్రీరామకృష్ణుడు భగవంతుని నిమిత్తమై ఏడ్వగల వారియందాయన కృపజూపును. అప్పుడు కారు కన్నీళ్ళు ఈ జన్మములో పాపములనేగాక, క్రిందటి జన్మములలో నిలువచేయబడిన పాపములను హరింపగలవు. భక్తి విశ్వాసములేగాక, షణ్మతముల చేతను ఆయనను కనుగొనజాలము. రామనామ బలముచే హనుమంతుడు సముద్రమును దాటెను. ప్రేమ చేతనే భగవంతుని గ్రహించవచ్చును. ప్రేమ, భక్తికి యజ్ఞములు, యాగములు, దానములు సాటిరావు. గాలి వీచనంతవరకే విసనకర్ర కావలయును. నీయందు నాకేమాత్రము అభిమానము ఆధారములున్నను ఆయనను తెలిసికొనలేవు.

- వడ్డూరి రామకృష్ణ