Others

చైతన్య జ్వాల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంకెన్ని రోజులు...
ఉప్పొంగే సముద్ర తరంగాలను ఏమార్చి
బాధాతప్త హృదయంతో
ఎగసే ఉల్లాస జ్వాలలను.. చల్లార్చి
ఆవేదనా భరిత కన్నీటితో
కుళ్ళు సమాజానికి భయపడి
నీలో నీవే కుమిలిపోతావ్...

ఇంకెన్ని రోజులు
ప్రభాత సూర్యుడివై వెలిగే
కిరణాలను దిశమార్చి
శోకసంద్రంలో ఓలలాడుతూ...
వెలిగే చంద్రోదయాన్ని అస్తమింపజేసి
అమావాస్య చీకటిలో కలిసిపోతావ్
ఇంకెన్ని రోజులు...
చెలరేగే బడబాగ్ని జ్వాలలను చల్లబరచి
నీ కన్ను నీవే పొడుచుకుంటూ
జ్వలించే నిప్పు కణికల్ని ఆర్పేసి
ఆలోచనల హృదయ వేదనలో
అవిటి ఆలోచనలకు కరిగి
నిన్ను నీవే మోసం చేసుకుంటావు
ఎగతాళి మాటలకు చైతన్యపు మనసు
కరగడం అవసరమా?
జీవితాన్ని ఎడారి చేసే నికృష్టపు ఆలోచనలు
రానీయడం అవసరమా?

నీ మనశ్శక్తిని గుర్తించు
మనో నిబ్బరాన్ని పెంపొందించు
నీకై నీవు పోరాడు
నీతో నీవే పోరాడు...

నీ భావావేశం రగిలించు
అదే అందిస్తుంది అంతులేని సంతోషం
నీ అంతరంగ తీరం కదిలించు
అదే చేరుస్తుంది నిను విజయాల తీరం

- కాళంరాజు వేణుగోపాల్, 8106204412