Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బూది ప్రోవె లేచెననగ- లేచెనపుడు శివుడు
పార్వతికేల్గొని నర్తన మొనరించెను భవుడు.

బూదినటుల పులుముకొన్న శివుడు ప్రేమతత్త్వమరసె
దేవునటుల నలుముకొన్న కాముడు దైవత్వమరసె.

శివుని కంటి నీరమ్మే ప్రాణమ్ముల బోసెననగ
మన్మథుండు లేచెనపుడు- మనములె కనుగొనగ.

రతికంటను వెలుగుమొలిచె- కంతు కౌగలించె కాంత
వారివురి పదములందు- వీరిరువురు వాలిరంత.

‘‘నీ పుస్తెలు నిలుచుగాక నిలుచు దాక కాలమ్ము
చావుకైన చావుండును- మీ కింకను లేదు సుమ్ము.

వరలుడెల్ల కాలమ్మును- ప్రేమకు పట్టముగట్టుచు
విశ్వప్రేమ యను రథమున చక్రమ్ములు వీరగుచు.’’

అనుచు రతీమన్మథులను శివుడంతట దీవించెను
తనకోసమె తపియించెడు పార్వతి కేల్గొనెను.

గిరిజాశంకరులకాయె కల్యాణము ఘనముగాను
రతీమన్మథులు మురిసిరి- తమ ధ్యేయము తీరగాను.

నాటినుండి హరునకు చితి ప్రేమాలయమాయెను
నాటినుండి కుసుమశరుడు అనంగుడై పోయెను.

కనిపించని కామునితో కాపురమ్ము రతి సేసెను
కనిపించక కాముడుండె ప్రేమభరిత హృదయాలను.
ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087