Others

శబరీషుని సన్నిధి.. సత్యనారాయణుని పెన్నిధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ ప్రాంతంలోనే అరుదైనదై, పవిత్ర గోదావరి నదీ తీరాన గుట్టపై వెలసి, సుప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన ధర్మపురికి 11కిలో మీటర్ల దూరాన మంచిర్యాల జిల్లా సరిహద్దున దండేపెల్లి మండలం గూడెం వద్ద, 63వ నెంబరు జాతీయ రహదారికి ఆనుకుని, భక్తుల పాలిటి వరదునిగా వాసి కెక్కిన సర్వజన బాంధవుడైన గూడెం రమా సహిత సత్యనారాయణ స్వామి, దానికి ఆనుకుని చిన్నగుట్టపై కొలువు తీరిన హరిహర సుతుడైన, కలియుగ దైవం అయ్యప్ప స్వామి ఆలయాలు నిత్యభక్తజన సందోహంతో కళకళలాడుతున్నాయి.
ఆంధ్ర రాష్ట్రంలో సుప్రసిద్దమైన శ్రీసత్యనారాయణుని దేవస్థానాలలో మొదటిది తూర్పు గోదావరి జిల్లా అన్నవరం కాగా, తెలంగాణలో మరో అన్నవరంగా గుర్తింపునందిన గూడెం రమా సహిత సత్యనారాయణ స్వామి దేవస్థానం. 50సంవత్సరాలకు పూర్వం గూడెం గ్రామస్తుడైన గోవర్ధన వెంకట స్వామి అనే భక్తునికి శ్రీసత్యనారాయణుడు స్వప్నమందు దర్శనమిచ్చి, నేను మీ గ్రామ శివారులో రాట్నపు చెవుల కొండపై వెలసి ఉన్నానని చెప్పగా, అది కలే లెమ్మని ఆయన ఊరుకోగా, మళ్ళీ పెరుమాళ్ళకు స్వామి కలలో కనపడి, తాను వెలసి ఉన్న విషయం తెలుపగా, పెరుమాళ్ళు కొండపైకి వెళ్ళి ఎంత వెదికినా కనిపించని స్థితిలో ఇంటికి తిరిగి వెళ్ళగా, ఆరాత్రి స్వామి మళ్ళీ కలలోకి వచ్చి రాట్నపు చెవుల కొండపై చిన్న నీటి కొలను, దాని పక్కనే ఉత్తర దిశలో ఉన్న గుహలో తానున్నానని అదృశ్యం కాగా, తెలవారగేనే గోవర్ధన స్వామి, సత్యనారాయణుని కోసం వెదకగా గుహలో విగ్రహం దర్శనం కావడం జరిగింది. విగ్రహాన్ని ముట్టుకోకుండానే గోవర్ధన స్వామి పరుగున వెళ్ళి గోదావరిలో మంగళ స్నానానమాచరించి, పూజా ద్రవ్యాలతో కొండపైకి చేరి అభిషేకాది పూజాలు చేయగా, విషయం తెలుసుకున్న గ్రామస్తులు స్వామి దర్శనం చేసుకుని, పూజలు జరిపారు. ఇలా కొండపై వెలసిన స్వామి గురించి తెలిసి కొన్న భక్తులు తండోపతండాలుగా రావడం జరిగింది. ఈదేవస్థానంలో ప్రతి ఏడూ మాఘ శుద్ధ ద్వాదశి నాడు స్వామి వారి కల్యాణం, హోమం, రథోత్సవం తదితర కార్యక్రమాలు బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా, ప్రతి పౌర్ణమి జాతర, నిత్య సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించ బడుతున్నాయి.
అలాగే సత్యనారాయణుని గుట్టను ఆనుకుని అత్యంత సమీపాన చిన్నగుట్టపై వెలసిన హరిహర సుతుని మందిరం అశేష భక్తజన సంద్రమై విరాజిల్లుతున్నది.

-సంగనభట్ల రామకిష్టయ్య 9440595494