Others

అమృతవర్షిణి భారతావని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యుని కోమల కిరణాలు భూమిని తాకిన వేళ
అణువణువూ ఓంకార ధ్వని !
ధిక్కారాల నుండి విముక్తి పొందిన
శోభాయమైన దివ్యకాంతిలో
స్వేచ్ఛా విద్యుల్లత మెరిసి నాట్యమాడే తరుణంలో
శాంతి సందేశం వందేమాతరం!

గడచిపోయిన గతకాలపు గాయాలు
గంగా ప్రవాహ శీతల జల స్పర్శలో పునీతమైనట్లు
ప్రతిధ్వనిస్తున్న జయకేతనాల మధుర ధ్వనుల మధ్య
కొన్ని స్మృతులను మరచిపోవడంలోనే సుఖం ఉంది

ఏ తుపానులు పెకిలించలేని పచ్చని పచ్చిక బయలు
ఉన్నతి కన్పరుస్తున్న ఉత్సవం మన భారతం!
శతాబ్దాల మతసామరస్యానికి ప్రతీక
ప్రేమ కరుణల శాంతిగృహం
ప్రాచీన నాగరికత ఉట్టిపడే అమృతవర్షిణి!
భిన్నత్వంలో ఏకత్వం మన మతం
ఇది సత్యం! ఇదే సత్యం!

- బులుసు సరోజినీ దేవి 9866190548