Others

ఏకప్రాస బాసర సరస్వతీ శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పల్లవి లాలి లలితాబాల లాలి శ్రీ లీల
లాలి లాలిత విశ్వ లీలా విలోల
శ్రీమణి ద్వీపాన జెలువారు తల్లీ!
సామ్రాజ్యముల నొసగు శ్రీతకల్పవల్లీ!
ఏ మణుల మంచంబు నేర్పరుపలేను
నా మనసు మంచాన శయనించ వమ్మా

అఖిలాండ కోటి బ్రహ్మాండ భాండముల
సృష్టిలయ కార్యముల శ్రమ జెందినావు
అందుకే నా మనసు పర్యంకమందు
నిముసమ్ము సేపైన నిదురించువమ్మ
వెడద యెడదను నీకు పడక గదిజేసి
భక్తి గుణమను పట్టు పరుపులను పరచి
తలపులన్నియు నీకు తలగడగ జేసి
ఎదురుచూచెద నింక నిదురించరావె

ఈ చరాచర సృష్టి కేలికవు నీవు
రాచకార్యము వలన శ్రమజెందినావు
శివ్వయ్య దొరయేమి సేయుచున్నాడె
చూచుకొనలేడె నీ చోద్యాలు గాని

-ఉమాపతి శర్మ 9246171342