Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాటినుండి ‘అంగదేశ’మాయెను ఈ దేశము
నాటినుండి ‘కామాశ్రమ’మాయెను ఈ ఆశ్రమము.

అని తెలుపగ కౌశికుండు ఆనందమునందిరి
రామలక్ష్మణులు మునితోనట నా రాత్రము గడిపిరి.

తాటకవధ
వచనం: మరునాడు వారు పడవపై గంగానదిని దాటారు. సరయూ నదీ సంగమాన్ని దర్శించారు. అక్కడ ఉత్పన్నమయ్యే మనోజ్ఞమైన ‘‘తుముల ధ్వని’’ని విని పులకించిపోయారు. త్రిపథగామియైన అచటి గంగానదికి అంజలించారు. ఆపై వారు దండకారణ్యంలోని తాటకవనాన్ని చేరారు. క్రూరమృగ సంచారంతో అది అత్యంత భయంకరంగా ఉంది.
‘‘ఇంత భయంకరమైన ఈ అడవిలో మునులెలా ఉండగలుగుతున్నారు’’? అంటూ రామలక్ష్మణులు విశ్వామిత్రున్ని ప్రశ్నించారు.
అప్పుడా విశ్వామిత్రుడు వారికి తాటకి కథనిలా వివరించాడు. సుకేతుడనే యక్షుని కూతురు తాటకి. ఆమెకు వెయ్యేనుగుల బలం. ఆమె సుందుని వివాహమాడి, మారుచుని కన్నది. వాడత్యంత పరాక్రమ వంతుడు. సుందుడు అగస్త్య మహర్షిని పీడించి, అతని శాపంతో మరణించాడు. అప్పుడు తల్లీ కొడుకులు అతన్ని చంపజూశారు.
అత్యంత ప్రతాపవంతుడైన ఆ ముని వీరిరువురినీ శపించి, రాక్షసులుగా మార్చాడు. అప్పటినుండి వీరు ప్రజలపై బడి బాధిస్తున్నారు. యజ్ఞయాగాది కర్మలను అపవిత్ర పదార్థాలతో కలుషితం చేస్తున్నారు. ఆ తాటకి ఈ వనంలోనే నివసిస్తోందిప్పుడు. ఒకిన్నర యోజనాలవరకూ ప్రజల్ని అడ్డుకుంటోంది. అది ఆడుదని జాలిపడవద్దు. అత్యంత పాతకి అది. దాని చావే లోకానికి కల్యాణ కాలకమవుతుంది’’ అన్నాడు.
ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087