Others

క్షమాగుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ మతమైనా క్షమాగుణాన్ని కలిగి ఉండాలనే చెబుతుంది. క్షమ లేనిదే వ్యక్తి జీవితం నిరర్ధకం అనిపిస్తుంది. దుర్లభమైన మానవ జన్మను పొంది అజ్ఞానంతో తప్పులు చేసినవారిని చూసి వారిని క్షమించడం గొప్ప గుణం. ఈ క్షమ వల్ల తప్పులు చేసినవారు తిరిగి తప్పులు చేసే అవకాశం ఉండదు. వారిలో పశ్చాత్తాపం కలుగుతుంది. ఎందుకు తప్పు చేశామా ? వారు మనలను క్షమించారు కనుక సరిపోయింది లేకపోతే అన్న చింతన పెరుగుతుంది. వారి ఆలోచనే వారిని సన్మార్గంలోకి తెప్పిస్తుంది. కనుక క్షమ ప్రతివారికి ఉండితీరాలి. ఎప్పుడోఒకప్పుడు మనిషి ఏదో ఒక పొరపాటు చేయవచ్చు.కనుక అటువంటి వారిని క్షమించడమే మంచి పని. మహా ప్రవక్త (స) కూడా ఎవరితోను ప్రతీకారచర్యకు పూనుకొనేవారు ఆదు. తనకు హాని చేయాలని వచ్చిన వారిని సైతం క్షమించి వదిలిపెట్టేవారు. ఆయనను ఇస్లాం వ్యతిరేకులు ఎన్నోరకాలుగా ఎన్నో యాతనలకు గురిచేశారు. ఆయన దేహాన్ని వారు గాయాలతో రక్తసిక్తం చేశారు.
అయినా సరే వారు దయార్ద్రహృదయంతో వారిని క్షమించేవారు.
ప్రతిరోజు (స) తన ఇంటినుంచి బయలుదేరి మసీదుకు కాలినడకన వెళ్లి వచ్చేవారు. దారిలో ఒక చోట ఓ మహిళ తనింటిపై భాగంలో నిలబడి ఆదారంట వెళ్తున్న ఆ మహాప్రవక్త(స) పై చెత్తా చెదారాన్ని గుమ్మరించేది. ఇట్లా ప్రతిరోజు ఆ మహిళ చేస్తున్నా కూడా ప్రవక్త ఒక్కరోజు కూడా ఆ మహిళను పనె్నత్తు మాట అనేవారు కాదు. ఆమెను ఎందుకీ పని చేస్తున్నావని కూడా అడగకుండా ఓర్పు, సహనాన్ని పాటిస్తూ ముందుకు సాగిపోయేవారు. ఇట్లా చాలారోజులు సాగింది. కాని కొన్నాళ్ల తరువాత ఆ దారింట వెళ్లే ప్రవక్తపైన ఓ రోజు చెత్తాచెదారం పడలేదు.ప్రవక్త గమనించి కూడా ఏమీ అనకుండా వెళ్లిపోయారు. మరుసటి రోజు కూడా ఇలానే జరిగింది. అపుడు తలెత్తి ఆమె కోసం ప్రవక్త చూశారు. అక్కడెవరూ ఆయనకు కనిపించలేదు. ఏమి జరిగి ఉంటుందని ఆలోచించారు. ఆమె గురించి అక్కడ చుట్టు పక్కల వారితో మాట్లాడారు. వారు ప్రవక్తతో ఆమె అనారోగ్యం పాలైందని చెప్పారు. ప్రవక్త ఎంతో బాధపడ్డారు. వెంటనే ఆమె ఇంటికి వెళ్లడానికి ఉద్యుక్తులయ్యారు. చుట్టూ ఉన్నవారంతా ఎందుకు వెళ్తున్నారు. మీపైన ఆమె చెత్తచెదారాన్ని పోసింది కనుక ఇపుడు దేవుడే ఆమెను శిక్షించాడు అని చెప్పారు. కానీ ప్రవక్త అల్లా ఎపుడూ ఎవరినీ శిక్షించడు. అందరినీ జ్ఞానంతో మెలగమని చెప్తాడు. కానీ మనం తప్పు చేసినపుడు నాబిడ్డలు ఇలా చేశారే అని ఆయన బాధపడుతాడు. కనుక మనం ఎప్పుడూ తప్పులు చేయగూడదు అని చెప్పాడు. ఆ తరువాత ప్రవక్త చెత్త వేసే ఆమె ఇంటికి వెళ్లాడు. ఆమె ప్రవక్తను చూసి చాలా ఆశ్చర్యపోయింది. మాటలు రాక నిలబడి పోయింది. అప్పుడు ప్రవక్త చొరవచేసి ఆమెకు అనారోగ్యం ఎందుకు కలిగిందో అడిగి తెలుసుకొన్నాడు. మందులు వేసుకొంటున్నావా.. వైద్యులు ఏమన్నారు అనే ప్రశ్నలు వేసి ఆమె ఆరోగ్యం త్వరగా బాగవుతుందని తెలుసుకొన్నాడు.
ప్రవక్త మాటలు విని ఆమెకు పశ్చాత్తాపంకలిగింది. వెంటనే ఆయన పాదాలపై పడి రోదించింది. తన్ను క్షమించమని వేడుకొంది. తన తప్పులను క్షమించాలని ఆమె కన్నీటితో వేడుకుంది. అపుడు ప్రవక్త ఆమెను లేవనెత్తి ‘తల్లీ! ఏదో, ఎందుకో జరిగిపోయింది. దానికి ఎందుకు బాధపడుతున్నావు. దానిని నేను మర్చిపోయాను. నీవు కూడా మర్చిపో’’ అని చెప్పారు. ‘నేను అసలు నీవు ప్రతిరోజు చెత్త పోయడానికి వచ్చేదాని కదా ఇపుడు రాకపోతే ఏమి జరిగిందా అని మాత్రమే వచ్చాను. ’అని చెప్పారు. ప్రవక్తలోని మంచితనం, తనలోని చెడుతనం ఆమె గుర్తించింది.
ఇట్లా మహాప్రవక్త(స) ఆమె తప్పులను మన్నించి, ఆమెలోని దుష్టత్వాన్ని పెకిలించివేశాడు చెడు నడతలో ఉండేవారిలో పరివర్తన కలుగచేస్తుంది.

- శ్రీమతి పి. షహనాజ్, 9346263070