Others

నాకు నచ్చిన పాట.. ఈ జీవన తరంగాలలో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఈ జీవన తరంగాలలో.. ఆ దేవుని చదరంగంలో..’ -యద్దనపూడి సులోచనారాణి నవలకి డి రామానాయుడు రూపాన్నిచ్చిన జీవన తరంగాలు చిత్రంలోనిదీ పాట. కన్నకొడుకులు తమ తల్లిదండ్రులను బ్యాంక్ బ్యాలెన్స్‌లా కాకుండా, కనిపెంచిన దేవుళ్ళుగా భావించాలని చెప్పే గొప్ప చిత్రమిది. ‘ఈ జీవన తరంగాలలో/ ఆ దేవుని చదరంగంలో/ ఎవరికి ఎవరు సొంతము/ ఎంతవరకీ బంధము...’ అంటూ మనిషి మధ్యగల అంతరాన్ని ఎత్తిచూపించి రచయిత ఆత్రేయ కన్నీరు పెట్టించిన పాట.
లైఫ్‌ని తాత్విక చింతనలో చూపిస్తూ ఆత్రేయ రాసిన చరణం -మానవ సంబంధాలు ఎంత గొప్పగా ఉన్నాయో తెలియచేయడమే కాదు, మనల్ని మనం ఒకసారి రివ్యూ చేసుకునేలా చేస్తుంది. ‘కడుపు చించుకు పుట్టిందొకరు/ కాటికి నిన్ను మోసేదొకరు/ తలకు కొరివి పెట్టేదొకరు/ ఆపై నీతో వచ్చేదెవరు?’ అంటూ ప్రశ్నిస్తాడు ఆత్రేయ. కళ్లముందు కనిపిస్తున్న నిజాన్ని కలం నుంచి పదునుగా వినిపించగలిగాడు మనసుకవి ఆత్రేయ. కన్న తల్లితండ్రులను బజారుపాలు చేసే కొడుకులకు ఈ పాట ఓ గుణపాఠం. మనిషి బతికున్నపుడు నాలుగు ముద్దలుపెట్టని వారసులు -చచ్చాక శవంపై పిండి వంటలు, మాంసం, మద్యం పెడితే తినేది కుక్కలు, పందులే. మనిషి చేస్తే మద్యం నీళ్ళలాగా ప్రవహిస్తున్న రోజులివి. చచ్చినవారి పేరు చెప్పుకుని ఫుల్‌గా మజా చెయ్యడం పరిపాటిగా మారుతోంది. కన్న తల్లిదండ్రులను ఊళ్లో వదిలేసి, భార్య పిల్లలతో వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని తీర్థయాత్రలకు వెళ్తే పుణ్యం రాదు, కనిపించిన తల్లిదండ్రులను కంటి పాపలాగా చూసుకుంటే పుణ్యఫలం దక్కుతుంది. మానవ సంబంధాలు ఎలా దిగజారిబోపోతున్నాయో -42 ఏళ్ల క్రిందటే ఊహించిన దార్శనికుడు ఆత్రేయ. ఘంటసాల ఈ పాట పాడి కన్నీరు పెట్టిస్తే -జెవి రాఘవులు సంగీతం మనల్ని శోక సముద్రంలో ముంచెత్తుతుంది. శోభన్‌బాబు సహజ నటన మన కళ్లను చెమర్చేలా చేస్తుంది. తెలుగు సినిమా పూదోటలో ఓ ఆణిముత్యంలాంటి పాట ఇది.

***
వెనె్నల రచయితలకు
సూచన

వెనె్నలకు రచనలు
పంపాలనుకునే వారు
ఈ కింది విషయాలను గమనించగలరు

ప ప్రతి మంగళవారం వెలువడే వెనె్నలకు రచనలు శుక్రవారంలోపు చేరాల్సి వుంటుంది.
ప రచనల్లో కొత్తదనం ముఖ్యం
ప అరిగిపోయిన పాత సినిమా కబుర్లు, శ్రద్ధాంజలి వ్యాసాలు, సినిమాలపై హితబోధల కన్నా, చదివించే కొత్త తరహా వ్యాసాలకు ప్రాధాన్యత వుంటుంది.
ప కొత్త సినిమాలపై సమీక్షలు రాయాలనుకున్న ఔత్సాహికులు ముందుగా ఒకటి రెండు సమీక్షలు పరిశీలన కోసం రాసి పంపితే, పరిశీలించగలం.
ప తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వచ్చే కొత్తసినిమాలను పరిశీలించే ఆసక్తి వున్నవారు, సంబంధిత వ్యాసాలు పంపితే అవీ ప్రచురణార్హమే.
ప కొత్త హాలీవుడ్ సినిమాలకు సంబంధించిన వ్యాసాలకు కూడా స్వాగతం.
ప ఇంతవరకు ఎక్కడా ప్రచురితం కాని, అపురూప చిత్రాలువుంటే పంపొచ్చు.
ప రచనలను ఈ మెయిల్‌లో స్కాన్ లేదా పిడిఎఫ్ ఫార్మాట్‌లో vennela@deccanmail.comకు మెయల్ చేయగలరు.
ప ప్రచురించిన (మీ వ్యూస్ మినహా) ప్రతి వ్యాసానికి పారితోషికం వుంటుంది.

మా చిరునామా :
ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్ , సికిందరాబాద్- 03

-కోలిపాక శ్రీనివాస్, బెల్లంపల్లి