Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అలాగే స్వామీ! మీ మాట నాకు శిరోధార్యం. మీ ఆజ్ఞను మీరితే నేను మా తండ్రిగారి మాటను మీరినవాడినవుతాను. అందువల్ల మీరు చెప్పినట్లే చేస్తాను’’ అన్నాడు రాముడు.
‘‘ఆ రక్కసి ఈ వనంలోనే నిద్రిస్తుంటుందిప్పుడు. దాన్ని నిద్ర లేపి ఎదుర్కొనాలి’’ అన్నాడు.
‘‘అలాగే’’ నంటూ శ్రీరాముడు ధనుష్టంకారం చేశాడు. ఆ ధ్వని ఆ వనమంతటా ప్రతిధ్వనించింది. ఆ యక్షిణి ఆవులిస్తూ నిద్రలేచింది. రామలక్ష్మణులపై పర్వతంలా పడజూచింది. కానీ విశ్వామిత్రుడు హూంకరించడంతో ఆగిపోయింది. ఆపై, వారిపై రాళ్ళవర్షం కురిపించసాగిందొక మహామేఘంలా! తన బాణాలతో వాటి నడ్డుకున్నాడు రాముడు. ఆపై ఆమె రెండు చేతుల్నీ ఖండించాడు. లక్ష్మణుడామె ముక్కు చెవుల్నీ కత్తిరించాడు. అది వెర్రిగా అరుస్తూ, పిడుగులా వారిపై బడజూచింది. తన శక్తిమంతమైన బాణంతో ఆమె వక్షాన్ని చీల్చివేశాడు రాముడు. అది తునాతునియలవుతూ ఒక కాలమేఘంలా కూలిపోయింది. దేవతలంతా శ్రీరామ లక్ష్మణుల్ని ప్రశంసిస్తూ పుష్పవర్షం కురిపించారు.
విశ్వామిత్రుడు వారిని ప్రశంసించాడు. శ్రీరాముని మూర్థాన్ని చుంబించాడు.
ఆ రాత్రి వారు ఆ వనంలోనే నిద్రించారు.
అస్తశ్రస్త్ర ప్రదానం
వచనం: మరునాడుదయం అమితానంద భరితుడైన విశ్వామిత్రుడు రామున్ని చేరదీసి, పుత్త్రవాత్సల్యాన్ని కనబర్చుతూ, ‘‘రామా! నీకు కొన్ని దివ్యమైన అస్త్ర శస్త్రాల్ని అందజేస్తాను. వానితో లోక కంటకుల దునిమి, ధర్మరక్షణ గావించు! మహావీరుడవైన నీ వంటి ధర్మజ్ఞుడే అందుకు సమర్థుడు’’ అని ఆ అస్తశ్రస్త్రాల గురించీ, ధర్మ రక్షణ గురించీ, ఇలా ఉపదేశించాడు.

ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087