Others

యోగాభ్యాసం.. శారీరిక, మానసిక దృఢత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యోగం అన్నమాట పవిత్రమైంది. అత్యంత శక్తివంతమైంది. ‘ఎవరైనా ఏదైనా వస్తుందనుకొన్నది రాలేదని బాధపడుతుంటే నీకా యోగం ఉంటే తప్పక వస్తుందిలే అని అంటుంటారు. యోగం అన్నమాట ఎన్నో అర్థాలనిస్తుంది. ‘యోగం’ అన్న మాటకే ధ్యానం, ఉపాయం, కూడిక, కూర్పు, ప్రయత్నం, కవచం, అపూర్వవస్తుప్రాప్తి అనే అర్థాలున్నాయి. ప్రపంచానికి నీతి, ధర్మం బోధించిన భగవద్గీతలో కూడా యోగం అన్నపదానికి నీవు చేసే పనుల్లో నైపుణ్యం పెంచుకోవడమే యోగం అన్న అర్థాన్ని చెబుతుంది. మనిషి సాధారణంగా ఇంద్రియాల లోలత్వం కలిగినవాడు. కాని ప్రాణాయామంతో యోగా భ్యాసాన్ని చేసి మనస్సును నియంత్రణ చేసుకోగలిగితే ఇంద్రియ జయమే కాదు పరబ్రహ్మ సాక్షాత్కారం కూడా పొందవచ్చు. కుంభక, రేచక, పూరక నియమాలను పాటిస్తూ చేసేదే ప్రాణాయామం. శరీరంలో ఉన్న వాయువులను క్రమబద్దీకరించు కోవడానికి సూర్యనాడి భేది, శీత్కారీ , భస్ర్తీక, భ్రామరి, కపాలభాతి మొదలైన ప్రాణాయామ పద్ధతులను అవలంభిస్తూ మనస్సును నియంత్రించుకోవడమే ప్రాణాయామం అని కూడా చెప్పవచ్చు. ప్రాణాయామ నిష్ణాతులు కావడానికి, శరీరాన్ని, మనస్సును నియంత్రణ లోకి తీసుకుని రావడానికి ఉపయోగపడేవే యోగాభ్యాసాలు. వీటిల్లో సూర్యనమస్కారాలు కూడా ఒక భాగమే. ఇంతకుముందుకాలంలో ప్రతి వారు యోగాభ్యాసం చేసేవారు. మొట్టమొదట యోగాను ప్రపంచానికి పరిచయం చేసింది భారతదేశమే అనుకోవచ్చు.
యోగాభ్యాసాన్ని ప్రతిరోజు అభ్యసించ డానికి శారీరికంగా, మానసికంగా ధృడత్వాన్ని కలిగి ఉండాలంటే కర్మయోగాన్ని అనుష్టించాలని భారతీయం చెబుతుంది. కర్మ యోగాన్ని అభ్యసించే వారి వెంట భగవంతుడు కూడా ఉంటాడని చెబుతుంది.
కర్మయోగం అంటే ప్రతిఫలాపేక్ష లేకుండా తన విధులను, బాధ్యతలను నిర్వర్తించడం, దీనినే గీత ‘నీ కర్తవ్యాన్ని నీవుచేయి నీ యోగక్షేమాలు నేను చూస్తా’అని భగవానుడే చెప్పాడని చెబుతుంది. ఇంత మహత్తరమైన యోగ సాధనలో మనో యోగం అనే భాగం చాలా విశిష్టమైంది. అంటే మనస్సును నియంత్రణలోకి తెచ్చుకోవడమే. ఇందులోనే అనేక రకాలైన అభ్యాసాలున్నాయి. అభ్యాసం కూసువిద్య అన్నదిందుకే. ప్రయత్నం చేస్తూ ఉంటే ఒకరోజు రానిది నాలుగు రోజుల తర్వాత అదే వస్తుంది. కనుక ఏకాగ్రత సాధించడానికి, మనసును నియంత్రించడానికి యోగాన్ని ఒక అభ్యాసంగా చేసుకోవచ్చు ఇందులో ఉండే యమనియమాదుల విషయాన్ని పతంజలి యోగ సూత్రాలు వివరంగా చెబుతాయి. పతంజలి యోగసూత్రాలను అభ్యాసం చేస్తూ ఉంటే మానవుని భవిష్యత్తును తెలుసుకోవచ్చు. అసలు అవ్యక్తుడైన భగవంతుడిని వ్యక్తం చేసుకోవచ్చు. భగవంతుని దివ్య దర్శన భాగ్యాన్ని యోగా వల్ల పొందవచ్చు. వీటిని సాధించే సాధకులను భీషణ ప్రతిజ్ఞ చేసి భీష్ముడిగా ఖ్యాతి నార్జించిన గాంగేయుడు సాధకులకు 12 యోగసాధనామార్గాలను కూడ చూపారని మహాభారతం చెబుతోంది.
ఈవిషయాలన్నీ తెలిసిన ప్రధాన మంత్రి నరేంద్రమోదీ గారు ఐక్యరాజ్యసమితివారికి యోగా గురించి చెప్పారు. ప్రపంచ యోగాదినోత్సవాన్ని జరుపుకునేలా చర్యలూ తీసుకొన్నారు. ఇపుడు జూన్ 21 ప్రపంచమంతా యోగా దినోత్సవాన్ని వైభవంగా ఆచరిస్తారు. ఈ ఒక్క దినోత్సవం నాడు యోగాను గురించి మాట్లాడడం కాక యోగాభ్యాసాన్ని నిత్యజీవితంలో అలవర్చుకుంటే అద్భుతయోగాన్ని అనుభవించవచ్చు.

-వాణిప్రభ