Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అస్తమ్రనగ మంత్రమ్మే- మంత్రమనగ ఆలోచన
ఆలోచన యన జ్ఞానం- జ్ఞానమూర్తి మనుజుండు

శస్త్ర మనిన ఆయుధమ్ము- మనిషి చేతబంటు
మనిషి మూర్ఖుడైన వేళ- మూర్ఖుడౌను బంటు.

మనిషే ఒక ఆయుధమ్ము- ఆలోచన పిడికిట
ఆలోచన ఆయుధమ్ము- ధర్మమార్గమునకిట.

ధర్మమ్మే మూలమ్ము- విశ్వవృక్షమునకు
ధర్మమ్మే ఛత్రమ్ము- విశ్వజీవరాశులకు.

ధర్మమ్మును రక్షించిన- అది మనకును రక్షన
ధర్మరక్షమ్మె మనకు- ఆత్మ రక్షణమ్మగును.

ధర్మాగ్లాని కలిగినచో - తల్లడిల్లు లోకమ్ములు
అటుల కలుగకుండ చూడవలయు ధర్మ ప్రభువులు

ప్రభువులె ధర్మం తప్పిన- తప్పెదరిక ప్రజలు
మానవత్వమంతరించి- మృగతత్త్వమ్మేలు

ధర్మమార్గమన వేదం- వేదమ్మన దైవమ్ము
ధర్మరక్ష జగద్రక్ష- వీడవలదు ధర్మము.

వీడవచ్చు ప్రాణమైన- వీడవలదు ధర్మము
ధర్మం నిలుపుటె ధర్మం- ధరణిని మానవులకు.
వచనం:- అని, ఈ విధంగా ధర్మోపదేశం గావించి, రామలక్ష్మణులకు అనేక శక్తివంతమైన అస్తశ్రస్త్రాలనొసంగి, వాటి ప్రయోగ, ఉపసంహారాలను తెలిపి, వాటితోపాటు ‘బల, అతిబల’ విద్యలను కూడా అనుగ్రహించాడు విశ్వామిత్ర మహర్షి.

ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087