Others

నాకు నచ్చిన చిత్రం.. సిరివెనె్నల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాకు బాగా నచ్చిన కళాత్మక చిత్రం -సిరివెనె్నల. అంధుడైన కళాకారుడి సంగీత ప్రతిభ, ఓ మూగ చిత్రకారిణి హృదయ వేదన, మాలిన్య స్ర్తి అమలిన త్యాగం.. మూడు పాత్రల ద్వారా హృదయంగమమైన సన్నివేశాలతో దర్శకుడు కె విశ్వనాథ్ సృజించిన అద్భుత సృష్టి -సిరివెనె్నల. ఈ చిత్రంలో ఏ సన్నివేశాన్ని స్పృశించినా ఒక అద్భుతమే. సుహాసినికి తొలిసారి హరి పరిచయమైనప్పుడు -ఓ గొప్ప కళాకారుడిని దగ్గరగా చూశారనే తన్మయత్వంతో నమస్కారం చేస్తుంది. అతడు అంధుడని తెలిసి కలత చెందే సన్నివేశం కంటతడి పెట్టిస్తుంది.
సుధాకర్ పెళ్లి సందర్భంగా హరి ఇచ్చి కచ్చేరిలో -‘విరించినై’ పాట ఓ అద్భుతం. ఆకాశం నుంచి జారిపడే మురళిని అందుకోడానికి ప్రయత్నించి విఫలమైన సుహాసిని, మూగదైన ఆమె చెప్పదలచుకున్న చరణాన్ని కాగితంపై రాయడం, అది వర్షానికి కరిగి మురళిలో పడటం, ఆ భావాన్ని అతను మురళిలో పలికించటం -ఎంత అద్భుతమైన దృశ్య భావుకతో అనిపిస్తుంది.
హరి చిత్రాన్ని సుహాసిని గీసినపుడు అందరూ పిచ్చిబొమ్మ అనుకుంటారు. కాని -రెండు నేత్రాలు సూర్యచంద్రులని, నాసిక వేణువుగా ఓంకార నాదాన్ని ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా తీసుకుంటున్నాడని ఆమె మూగ భాషను పెద్దాయన అర్థం చేసుకుని వివరించే సన్నివేశానికి పులకించిపోతాం. ఒకటేమిటి? ఏ సన్నివేశానికి ఆ సన్నివేశం ఒక దృశ్య కావ్యమే.
ఇక సాహిత్యపరంగా చూస్తే ప్రాకృత దిశను వీణగా, సూర్యకిరణాలను వీణాతంత్రులుగా, విహంగ గతులను ఆకాశ వేదికగా -ప్రకృతి అందాలను ఎదపై పరచిన సీతారామశాస్ర్తీ మనకు ‘సిరివెనె్నల’గా మిగిలారు. ‘ఆది భిక్షువువాడినేమి కోరేది?’ అని ప్రశ్నిస్తూ -తీపిరాగాల కోకిలమ్మకు నల్ల రంగునలమిన వాడినేమి కోరేది? అని ప్రశ్నిస్తాడు. వెంటనే -కరకు ఘర్జనల మేఘముల మేనికి మెరుపు రంగుపులిమిన వాడినేమికోరేది? అంటూ నిందాస్తుతితో ఈశ్వరుడిని నిలదీయటం శాస్ర్తీ తార్కిక ప్రతిభకు నిదర్శనం. చివరి పాటలో జ్యోతిర్మయి ప్రశ్నలకు సమాధానంగా ‘గానం పుట్టుక గాత్రం చూడాలా? ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియారా?’ అనే చరణాలు రచయిత భావావేశానికి మచ్చుతునకలు.
చక్కని సాహిత్యం, లలితమైన సంభాషణలు రసప్లావితమైన సన్నివేశ రూపకల్పన, నటీనటుల చక్కని ప్రతిభ, కెవి మహాదేవన్ సంగీతం, హరిప్రసాద్ చౌరాసియా మృదుమధుర వేణుగానం.. చూపులేని పిల్లకు మంచి పాట ద్వారా వెనె్నల్లో బృందావనం చూపించిన అత్యుత్తమ సన్నివేశాలు కలిగిన ఈ చిత్రం నాకు చాలా చాలా ఇష్టం. నూటికో కోటికో వచ్చే గొప్ప ఆణిముత్యాల్లో ‘సిరివెనె్నల’ ఒకటి.

-ఎ శ్రీనాథరెడ్డి, గుత్తి