Others

గోరక్షణతో ఉజ్జ్వల పురోగతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనాడు విద్యారణ్యస్వామి విజయనగర సామ్రాజ్యాన్ని సుస్థిరం చేయడానికి కనక వర్షం కురిపించారు. ఈనాడు ఆ మఠం నుంచే నేను గోరక్షణ చేసిన దేశం సుస్థిరంగానే కాదు సకల భోగభాగ్యాలతో వర్థిల్లగలదని గోరక్షణ స్వయంగా చేస్తూ ప్రతి భారతీయుడిని ఈ గోసంరక్షణలో పాలుపంచుకోమని ఉద్బోధిస్తున్నాను.
- శ్రీజగద్గురు ఆదిశంకరాచార్యులు
- హంపీ విరూపాక్ష విద్యారణ్య మహాసంస్థానం
- హంపీ విద్యారణ్య భారతీ స్వామి
*
గోసేవ భారతీయులకు అనాదినుంచి వస్తున్నదే. ఈ మధ్య విదేశీ మోజుతో గోసంపదను కాలతన్నుకుని గోవులను కబేళాలకు పంపిస్తున్నారు. ఇట్లా చేస్తే భారతీయుల భవితనే కాదు వర్తమానం కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది అంటారు ప్రస్తుత హంపీ విరూపాక్ష విద్యారణ్యస్వామివారు.
గ్రహదోషాలను, సర్వపాపాలను హరించ డానికి మాత్రమే గోవును పూజించడం కాదు, కుల మత భేదం లేకుండా మనిషిగా పుట్టిన ప్రతివారు నిత్య జీవితంలో గోవు ఎంత ప్రాముఖ్యాన్ని పొంది ఉందో తెలుసుకోవాలం టారు స్వామి.
గోవును పాలివ్వలేకపోతోందని కబేళాలకు తరలించడం మూర్ఖత్వం అంటారాయన. గోవులు ప్రతినిత్యం మనకు కావాల్సిన ప్రాణవాయువును, రాత్రి పగలు తేడాల్లేకుండా ఇస్తాయన్న విషయాన్ని మరిచిపోకూడదు. ప్రాణవాయువును పీల్చుకుని ప్రాణవాయువును ఇచ్చే ఏకైక ప్రాణి ఆవు. మనం పండు తినేసి పారేసిన తొక్కలు, బియ్యం కడిగి పారేసిన కుడితి, మనం పంట పండించుకుని వదిలేసిన గడ్డి, తవుడు, పొట్టు ఇవి తిన్న ఆవులు మనకు నిరంతరమూ ప్రాణవాయువును, ఎన్నో సంపదలు ఇస్తున్నాయ.
ఒక్క గోవుకి తన జీవితకాలంలో సుమారుగా 4,10, 400 మందికి ఒక పూట భోజనం పెట్టగల శక్తి ఉంటుంది. ఆవుపాలకు విషాన్ని హరించే శక్తి ఉంది. ఈ విషయాన్ని ఢిల్లీలోని ఎయిమ్స్ వారు కూడా పరీక్షించి మరీ తేల్చారు. క్యాన్సర్ అనేది ఒక జబ్బుకాదు అది ఒక ఇబ్బంది మాత్రమే. దాన్ని కూడా ఈ గోసంపదతో దూరం చేసుకోవచ్చు. వైద్యశాస్త్రానికి లొంగని ఎన్నో రోగాలకు గోసంపద జవాబు చెబుతుంది. ఆవునెయ్యి, బియ్యం రెండూ కలిపి వేడిచేసినపుడు ఇథలిన్ ఆక్సైడ్ , ప్రోపలీస్ ఆక్సైడ్ అనే వాయువులు వెలువడుతాయని శాస్తవ్రేత్తలూ నిరూపించారు. ఈ ప్రోపలిన్ ఆక్సైడ్ ద్వారానే కృత్రిమ మేఘాలు ఏర్పడి వర్షాలు పడుతాయ.
గోమూత్రం గంగాజలమంత పవిత్రమైంది. గోమూత్రం ప్రపంచంలోనే సర్వోత్తమైన కీటకనాశిని. గోవు పేడ మూత్రం ద్వారా ఎన్నో మందులు తయారు అవుతాయి. వీటి ద్వారా ముఖ్యంగా ఉదరకోశ వ్యాధులు అతి త్వరగా దూరమవుతాయి. ఇళ్లను, వాకిళ్లను గోవు పేడతో అలికితే రేడియోధార్మిక కిరణాలనుంచి మనలను మనం కాపాడుకోవచ్చు., అధిక ప్రాణనష్టం కలిగించే అణుయుద్ధం వచ్చానా, ఆ యుద్ధం వల్ల కలిగే నష్టాన్ని కూడా నిలువరించేశక్తి ఆవు ఇచ్చే సంపదలో మహత్తరంగా ఉంది. ఆవుపేడలో కలరావ్యాధిని కలుగచేసే క్రిములను నాశనం చేసే శక్తి కూడా ఉంది. ఒక తులం ఆవునెయ్యిని యజ్ఞంలో వాడితే ఆ యజ్ఞకుండం నుంచి ఒక టన్ను ప్రాణవాయువు వెలువడుతుంది. యజ్ఞాలల్లో వాడే ఆవుపేడతో చేసిన పిడకలు, ఆవునెయ్య వల్ల వచ్చే ధూమం మనిషిని శక్తివంతుడిగా మారుస్తుంది. భగవంతునికి ప్రత్యక్ష నైవేద్య సమర్పణ ద్వారా భగవంతుని అనుగ్రహం త్వరగా లభిస్తుంది. ఆవుజన్మనిచ్చే దూడల నుంచి వ్యవసాయానికి పనికి వచ్చే గిత్తలు, మళ్లీ పాలనిచ్చే గోమాతలను పొందవచ్చు. ఆవు ధన లక్ష్మి, ధాన్య లక్ష్మి. సంతానలక్ష్మి అక్షయసంపదలనిచ్చే మహాలక్ష్మి. ఇట్లా ఆవు ఇచ్చే సంపదలు ఇన్ని అని చెప్పలేనన్ని ఉన్నాయి కనుకనే అధ్వరణ వేదం సర్వసంపదలకూ మూలం గోవు అని చెప్పింది.
పురాణాలు వినడం వల్ల పుణ్యం వస్తుందని వినడం కాక అందులో ఉండే రహస్యాలను తెలుసుకొని వ్యక్తిగతంగా ఉన్నతిని సాధించాలి. అంతేకాక దేశాభ్యు దయానికి కూడా కారకులు కావాలి.
వశిష్ఠుడు కామధేనువును పూజించినందువల్లే విశ్వామిత్రుడి వంటి రాజును ఓడించగలిగాడు. అదే కార్త వీర్యార్జునుడు గోవుకు అన్యాయం చేయబోయ తానే నాశనం అయ్యాడు.
ఆవు ఇవ్వనిది అంటూ ఏమీ లేదు. ఆవు గురించి తెలుసుకొంటే గోవుకు ఎవరూ అన్యాయం చేయరు. హంపీలో గోశాల నుంచి వచ్చే పేడతోనే పంటలు పండిస్తున్నాము. ఇబ్బడి ముబ్బడిగా పంట దిగుబడి వస్తోంది. ఏ హైబ్రీడు రసాయనిక ఎరువులు వేయకుండా కేవలం సేంద్రియ ఎరువులతోనే పంటలు పండిస్తున్నాము.
ఏమతమూ గోవును చంపమని చెప్పడంలేదు. ముస్లిములు కూడా గోక్షీరము గొప్పమందు. కానీ గోమాంసం రోగకారకము అంటోంది. ఈ విషయాన్ని హజరత్ మహ్మమ్మద్ నే వెల్లడించారు. గోవులున్నపుడే నాగరికత పురోగమిస్తుందని బర్మార్డ్ మేక్ ఫెడన్ అన్నారు. లోక కళ్యాణం కోసం భగవంతుడిచ్చిన వరప్రసాదం గోవు అని ఆచార్య వినోభా భావే కూడా చెప్పారు. గోసేవ వల్ల సాధించనిది ఏదీ ఉండదు. గోసంరక్షణనే మనుష్యుల్లో పురోగతి, దేశసౌభాగ్యం ఆధారపడి ఉంటాయ.
కానీ మెకాల్ విద్యావిధానాన్ని ఒంట పట్టించుకున్న మన దేశపు మేధావులు గోరక్షణ చేయడం లేదు. గోసంరక్షణ చేసే దేశమే ప్రపంచంలోని అన్ని దేశాలకన్నా మిన్నగా ఉంటుంది. హైందవం అనేది మతం కాదు అది మన దేశపు ధర్మం. వైదిక సంస్కృతి అనేదీ ధర్మం. ధర్మాన్ని రక్షించిన నాడే మానవులు సుఖసంతోషాలతో జీవించగలరు. గోవును రక్షించడం, గోసేవ చేయడం, గోవులను పెంచడం ఎపుడు మొదలుపెడతారో భారతీయుని పురోగతి అప్పటినుంచి ఉజ్జ్వలంగా వెలుగుతుంది అని నేను గట్టిగా చెప్పగలను అని స్వామి చెప్పారు.

- పి.వి. రమణారావు 9849998093