Others

విభిన్నమైన ప్రేమకథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశ చరిత్రలో ఎన్నో ప్రేమకథలు..
స్వచ్ఛమైన ప్రతీ ప్రేమకు ఏదో అడ్డంకి లేదా విషాదాంతం..
నొప్పిని కలిగించినా ఆ ప్రేమకథలు చాలా బాగుంటాయి..
మనసును మెలిపెట్టి నొప్పి, బాధ కలిగించే తీయనైన భావనను వెలికితీస్తాయి..
ఇప్పటికి ఇలాంటివి ఎన్నో చూశాం.. విన్నాం..
కుల, మత, వర్గ, స్థాయి భేదాల అడ్డంకులను పక్కన పెట్టి ప్రేమను గెలిపించుకున్న ప్రేమికులెందరో ఉన్నారు. ఇప్పుడు చెప్పుకోబోయే ప్రేమకథ కూడా అలాంటిదే.. కానీ కాస్త విభిన్నమైనది.. వివరాల్లోకి వెళితే..
ముప్ఫై సంవత్సరాల పాటు అంతర్యుద్ధంతో అతలాకుతలమైన శ్రీలంకలో ఈ ప్రేమ కథ వినూత్నమైనదనే చెప్పుకోవాలి. ఎందుకంటే వైరి వర్గాలకు చెందిన రోషన్, గౌరిలు యుద్ధకాలంలో బద్ధ శత్రువులు. ఒకరిని చూస్తే ఒకరికి పడేది కాదు.. అసలు చూపులే కలిపేవారు కాదు.. ఒకవేళ ఏమరుపాటుగా చూసినా వైరిని చూసిన భావమే మనసులో మెదిలేది. మరి ఆ చూపులు ఎప్పుడు కలుసుకున్నాయో తెలీదు.. ఒకరికై మరొకరు చూడటం.. ఎదురుచూపులు.. విరహవేదనలు వెరసి ఐదేళ్ల క్రితం వారిమధ్య ప్రేమ చిగురించింది. ఇప్పుడు వాళ్లిద్దరూ పెళ్లి చేసుకుని హాయిగా జీవిస్తున్నారు.
రోషన్ జయలతిక, గౌరీ మలార్‌లు ప్రేమలో పడ్డారు. రోషన్ సింహళ సముదాయానికి చెందినవాడు. గౌరీ తమిళ సంప్రదాయానికి చెందినది. శ్రీలంక అంతర్యుద్ధంలో ఆమె తమిళ టైగర్ల తరపున పోరాడింది. యుద్ధం జరిగిన కాలంలో రోషన్ శ్రీలంక భద్రతా దళంలో ఉండేవాడు. గౌరీ ఎల్టీటీఈలో ఉండేది. ఆ యుద్ధం 2009లో ముగిసింది. పది సంవత్సరాల క్రితం వరకూ వారిద్దరూ బద్ధ శత్రువులు. కానీ ఇప్పుడు వారు ఒక పాపకు తల్లిదండ్రులు. రోషన్ వావునియాలోని ఇరట్టపెరియకులం గ్రామానికి చెందినవాడు. ఎల్టీటీఈ కన్నా టైగర్లు అనే పదానే్న వారు ఎక్కువగా వినేవారు. టైగర్లు వీరికి శత్రువులు కాబట్టి రోషన్‌కు కూడా వాళ్లపై విపరీతమైన కోపం ఉండేది. శ్రీలంకలోని కబిత్తిగొల్లేవా ప్రాంతంలో టైగర్లు ఒక బస్సును పేల్చేసి ఎందరో అమాయకుల ప్రాణాలను తీసినప్పుడు రోషన్‌కు వారిపై విపరీతమైన కోపం, ద్వేషం, జుగుప్స కలిగిందట. వారందరినీ చంపాలన్న కసి కలిగిందట.. ఇటు గౌరికి కూడా సింహళీయులంటే అదే ద్వేషం. ఆ సంప్రదాయం వారిని గౌరి ఎప్పుడూ కలవలేదు. మాట్లాడలేదు. వాళ్లు మంచివారు కాదు, టైగర్లు కనిపిస్తే చంపేస్తారు అనే భ్రమలోనే ఉండేదట గౌరి.
అప్పటి అంతర్యుద్ధ కాలంలో అదృశ్యమైన వేలాదిమంది తమిళుల్లో గౌరి పెద్దన్న కూడా ఒకరు. ఒక చెల్లెలిగా అన్నను వెతుక్కుంటూ వెళ్లిన ఆమెను తమిళ టైగర్లు పట్టుకుని ఆమెకు సైనిక శిక్షణ ఇచ్చింది. అలా ఆమె ఎల్టీటీఈ మెంబర్‌గా మారిపోయింది. ఇప్పటికీ గౌరి అన్న కనిపించలేదు. అతను చనిపోయాడో, బతికున్నాడో ఇప్పటికీ తెలియదు. ఇంకా తన తోడబుట్టిన వాడికోసం ఎదురుచూస్తోంది ఆమె. దేవుడు ప్రత్యక్షమై ఏం కావాలని కోరుకుంటారు అని ఎవరైనా అడిగితే.. ఇప్పటికీ అన్నయ్యను అని ఠక్కున చెప్పేస్తుంది గౌరి. అంత ఇష్టం ఆమెకు తోడబుట్టినవాడంటే.. అంతర్యుద్ధం ముగిసిన తరువాత గౌరిని రిహాబిలిటేషన్ సెంటర్‌కు తరలించారు. తరువాత ఆమె సివిల్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్‌లో చేరింది. 2013లో ఆమెకు పోస్టింగ్ వచ్చింది. అదే డిపార్టుమెంట్‌లో పనిచేస్తున్న రోషన్ తమిళులతో ఏదైనా చెప్పేందుకు భాష రాక ఇబ్బంది పడేవాడు. అలా కొద్దిరోజుల పాటు రోషన్ పడుతున్న ఇబ్బందిని గమనించిన గౌరి ఒకానొకరోజు సాయం చేయడం మొదలుపెట్టింది. అలా వారి మధ్య సంభాషణ మొదలైంది.. అది అనంతమైన భాషగా రూపుదిద్దుకుంది.. అలా అలా వారి జీవితం కూడా మారిపోయింది. రోషన్ మొదట తన మనసులోని మాటను గౌరికి చెప్పాడు. కానీ వెంటనే గౌరి అంగీకారం చెప్పలేదు. కొంత సమయం తీసుకుంది. కానీ ‘నో’ అని మాత్రం చెప్పలేదు. ఇద్దరూ సరే అనుకున్న తరువాత గౌరి తల్లి, సోదరి ఇద్దరూ ఈ పెళ్లికి అభ్యంతరం చెప్పారు. అయితే వారి అనుమతి లేకున్నా గౌరి, రోషన్‌లు 2014లో వివాహం చేసుకున్నారు. అలా వారి ప్రేమకు ప్రతిరూపంగా ఓ కూతురు. వారు తమ కూతురిని బహుళ మతాల, బహుళ సంస్కృతుల మధ్య పెంచుతున్నారు. వారు పాపకు తమిళ భాష నేర్పిస్తున్నారు. మిగిలిన రోజుల్లో సింహళ స్కూలుకు, ఆదివారాల్లో పాపను బౌద్ధ స్కూల్‌కు పంపుతున్నారు. ఇప్పటికీ ఆ జంట హిందూ మందిరాలకు, బౌద్ధ మందిరాలకు వెళ్తుంటారు. ప్రేమ లేనప్పుడు వారు ఒకరికొకరు నచ్చేవాళ్లు కాదు కానీ.. ఇప్పుడు వారి మధ్య ప్రేమ ఉంది.. దాని ముందు ఏవీ సమస్యలు కావు.. ఇప్పుడు ఆ దంపతుల అన్యోన్యాన్ని చూసి ఇరువర్గాల తల్లిదండ్రులు, స్నేహితులు మెచ్చుకుంటుంటే.. ఎంతో పొంగిపోతోంది ఈ ప్రేమజంట. *