Others

శ్రీకృష్ణ లీలాఠింఛోళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శరదిందు చంద్రికలు
తే.గీ. సాంద్ర శరదిందు చంద్రికా సమయమందు
అలనిశాసతి వదనాబ్జ తిలకమనగ
చంద్రుడాయనంగుని చేతి చక్రమట్లు
చల్లచల్లని వెనె్నలల్ జల్లుచుండ
వ్రజయువతులెల్ల వ్రేపల్లె వాడలోన
యదుకిశోరుని తలపులు హృదిని నిండ
మునిగి తేలిరి వారెల్ల మోహవార్థి

భావం: శరత్కాలపు సమయంలో రాత్రి కన్యకు నుదుటి బొట్టులాగా ప్రకాశిస్తున్న చంద్రుడు మన్మథుని చేతి చక్రంలాగా చల్లని వెనె్నల వెలుగుల్ని విరజిమ్ముతున్న వేళ గోపికా సమూహం గోపాలుని తలపులతో మోహవార్థిలో మునిగి తేలిందట.
జలకేళి
తే.గీ. గోపికల గూడి కృష్ణుండు కొలనిలోన
ఆత్మకింపుగ జలకమ్ము లాడువేళ
జలము మేనిపై జల్లుగా చల్లబడియు
తేజరిల్లు చునుండె మత్త్భేమట్లు
భావం: శ్రీకృష్ణుడు గోపికలతో కొలనులో జలక్రీడ సలుపుతూ ఉన్నాడు. గోపికల చేత మేనిపై నీరు చల్లబడిన వాడై నీలమేఘుశ్యాముడైన వాసుదేవుడు, ఆడు ఏనుగుల తొండములతో అభిషేకింపబడిన మత్త్భేం లాగా భాసించాడట.

- డి.వి.ఎమ్. సత్యనారాయణ 9885846949