Others

ఎవరీ పరదేశీ..శరత్కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పదహారణాల తెలుగుదనంతో ఉన్న ఆ అమ్మాయి ఎవరో పెద్దగా తెలీకపోవచ్చు. కానీ, ఆమె పక్కనే నిలబడిన నవనాగరిక యువతి కాస్త తెలిసినట్టుగానే అనిపిస్తోంది కదూ!
అవున్నిజమే... కాస్త తేరిపార చూస్తే ఇట్టే గుర్తు పట్టేయొచ్చు. ఆమె ఒడ్డూ పొడుగూ చూస్తుంటే -ఏ దేశపు పరకాంత ఎవరో మన దేశపు ఛాయ, పోలికలో ఉన్నంట్టుందన్న భావన కలుగుతోంది కదూ! ఆమె ఎవరు? అంత పొందికగా నిలబడి స్టిల్ ఇచ్చిందంటే -పక్కన నిలబడిన ఆమె ఎవరో పెద్ద విఐపీయే అయివుండాలి? అని కూడా అనిపిస్తోందా? సరే -ఇక్కడ చిన్న క్లూ. విదేశీ నాగరిక యువతిలో ఒద్దికగా వయ్యారంగా నిలబడిన ఆమె -ఆమె కాదు. అతడు. ఇప్పుడైనా గుర్తు పట్టగలరేమో ఆలోచించండి.
ఈ శీర్షికలో ఇలాంటి అరుదైన చిత్రాలు చాలా ఎదురైనా -ఎన్నింటిని కనుక్కోగలిగారో తెలీదుకానీ, ఈ చిత్రాన్ని తెలుసుకోవడం కొంచెం కష్టమే, కనుక వివరాలు చెప్పేస్తాను. ఆ తరం సినీ అభిమానులైతే, పరకాంతను గుర్తుపట్టేసే ఉంటారు. కానీ -పక్కన నిలబడిన ఆమె ఎవరో తెలీక పోవచ్చు. ఇంకా సస్పెన్స్ ఎందుకు, చెప్పేస్తాను. విదేశీ కాంతలా కనిపిస్తోన్న అతడు -హీరో కాంతారావు. ఆట బొమ్మలు చిత్రం షూటింగ్ కోసం ఆ గెటప్‌లో లొకేషన్‌కు వచ్చినప్పటి చిత్రం. షూటింగ్ స్పాట్‌కు వచ్చిన భార్య హైమావతితో సరదాగా తీయించుకున్న చిత్రమిది.

-పర్చా శరత్‌కుమార్ 9849601717