Others

నైషధమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్పుడున్న జన పదాలలో నల మహారాజుఒక అక్షౌహిణి సేన గలిగి ఆనాటి మహారాజులలో ఇంద్రునివలె వెలుగొందాడు. తన పరాక్రమంచేత రాజులందరినీ జయించి సార్వభౌముడై ప్రజారంజకంగా పాలన చేస్తున్నాడు.
సూర్యతేజస్వి అయిన నలుడు వేదవిదుడైన బ్రాహ్మణ్యమూర్తిగా ఉండేవాడు. అయితే నలుడు పాచికలాడటంలో అపరిమితమైన ప్రీతికలవాడు.
ఈ ప్రీతి వల్లనే రాజ్యాధికారి అయి ఉండీ, అపారమైన సైన్యసంపద, ధర్మాచరణ వల్ల కలిగిన తేజస్సు, అత్యుద్భుతమైన సౌందర్యమూ కలిగి కూడా కేవలం పాచికలాట వల్లనే ఘోరంగా ఓడిపోయాడు. అపరకుబేరునివలె పాలించిన నలుడు కట్టుబట్టల్లేకుండా అడవుల పాలైయ్యాడు.
దేవతలను సైతం తిరస్కరించి తననే ప్రేమించి పెళ్లాడిన తన ధర్మపత్నిని కారడవిలో వదిలేసి తన దారిన తాను వెళ్లిపోయాడు. కలి మాయాప్రభావంతో తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్టల్లేక, అత్యంత సౌందర్యవంతుడైనా కలిమాయను ఎదుర్కొనే ధైర్యం లేక కురూపి అయినాడు. ధర్మరాజా! విధిని ఎదిరించడం ఎవ్వరి వల్లనూ కాదు. అందులోనూ ఏదైనా వ్యసనాలకు బానిస అయితే ఆ వ్యసనమే వారి చేత కలి చేతిలో కీలుబొమ్మను చేసి ఆడిస్తుంది. వ్యసనమే అన్ని అనర్థాలకు మూలం. భగవంతుని సృష్టిని అర్థం చేసుకొంటూ తనకు లభ్యమైన మానవజన్మను సార్థక్యం చేసుకోవడానికి పాపపుణ్యాలను ఎప్పటికప్పుడు విచారిస్తూ, విషయ వాంఛలను నియంత్రించుకుంటూ పరమేశ్వరుని దయాపాత్రునిగా మెలుగుతూ ఉండాలి. ఏ కాస్త తొట్రుపాటు కలిగినా జీవితం అంతా అస్తవ్యస్తం అయిపోతుంది. కానిరాని ఇక్కట్లు చుట్టుముడుతాయి. ఈలోకంలో ఎవరూ అదృష్ట హీనులు కారు. ఎవరూ అదృష్టవంతులూ ఉండరు. కేవలం కాలమహిమ వల్లనే కొన్నాళ్లు కిందా మరికొన్నాళ్లు మీద ఉన్నట్టు భ్రమిస్తూ ఉంటారు.
మనమంతా నిమిత్తమాత్రులం దైవప్రమేయానికి మన పూర్వజన్మ వాసనలు కలగలసి సుఖదుఃఖాలు కలుగుతుంటాయి.
విధిని అనుసరిస్తూ వాసుదేవుని స్మరిస్తూ కాలం గడిపితే ఒకనాటికి కష్టాలు మాయమై తిరిగి సుదినాలు తప్పక వస్తాయి. మీ వంటి ధర్మవర్తనులు ఒకనాడు ధర్మం తప్పినా మీలోని పశ్చాత్తాపం, మీరు ఆచరించే ధర్మాచరణ, మీతో ఉండే దైవం మిమ్ములను తప్పక ఒడ్డుకు చేరుస్తాడు. మీకూ ఒకనాడు రాజ్యం దక్కుతుంది. మీరు భూమిని ఏలుతారు. తప్పక మీకు మంచి రోజులు వస్తాయి.
ఇదిగో ఈ శ్లోకాన్ని ఒకసారి మననం చేసుకో కలి దూరమవుతాడు. మీరు మళ్లీ స్వస్థులు అవుతారు అంటూ
కర్కోటకస్య నాగస్య దమయన్త్యా నలస్యచ
ఋతుపర్ణస్య రాజర్షేః కీర్తనం కలినాశనమ్
కలియుగంలోఎవరుఈ శ్లోకాన్ని చదువుకున్న వారి దగ్గరకు కలి రాడు అని చెప్పాడు.
ఆ విధంగా చెప్పిన బృహదశ్వమహర్షిని ఈ కర్కోటకుడు, దమయంతి, నలుడు, ఋతుపర్ణుడు వీళ్లంతా ఎవరు? వీరి పేర్లకు కలికి ఉన్న సంబంధమేమిటో మాకు వివరించండి. దానివల్ల మాలో తిరిగి మంచిరోజులు వస్తాయన్న ఆశ చిగురిస్తుంది. ఆ ఆశతోనే ఈ అరణ్యవాసాన్ని గడుపుతాము అని ధర్మరాజు మహర్షిని వేడుకున్నాడు.
అపుడు లోకకళ్యాణ కారకులు మహర్షులు కనుక ఆ బృహదశ్వమహర్షి ధర్మరాజుకు నలదమయంతుల కథను ఈ విధంగా చెప్పాడు.
నిషధ దేశాధిపతి సద్గుణ సంపన్నుడైన ‘‘నలుడు’’. ‘‘వీరసేనుడి కుమారుడు. పరాక్రమశాలి. అంతకుమించి అందగాడు. ఆనాటి మహారాజులలో ఇంద్రునివలె వెలుగొందుచుండేవాడు.
ఆ సమయంలో ‘విదర్భ’దేశాన్ని భీమ మహారాజు పాలిస్తున్నాడు. మహాబలవంతుడు. పరాక్రమశాలి.
విదర్భ దేశంనుండి నిషధ దేశం వచ్చిన వారంతా ‘నలునిముందు విదర్భ దేశపు రాజకుమారి ‘దమయంతి’ అందచందాలను, గుణగణాలను పూసగ్రుచ్చినట్లు చెప్పేవారు. అలాగే నిషధ దేశంనుండి విదర్భదేశం వెళ్ళినవారు దమయంతి ముందు నలునియొక్క అంద చందాలను, గుణగణాలను ఏకరువుబెట్టేవారు. అందువల్ల నలదమయంతుల మధ్య అనురాగాలు అంకురించాయి.
దమయంతిని గురించే నలుడు అతిగా ఆలోచిస్తుండేవాడు ఒకసారి ఆ దమయంతిని గూర్చి ఆలోచిస్తూ రాజప్రాసాదంలోగల ఉద్యానవనంలోనికి వచ్చాడు. పరాధీన మనస్కుడైన అతడి ఎదుట ఒక బంగారు హంస కనపడింది.
- ఇంకాఉంది