AADIVAVRAM - Others

ఏదో ఒక కారణం(సండేగీత )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచి పని చేసినప్పుడు
ఆ మంచి పని చేయనప్పుడు
మనకు ఒక కారణం కావాలి.
అది తప్పక దొరుకుతుంది.
మనం ఇప్పుడున్న పరిస్థితిని తిట్టుకోవడానికి ఒక కారణం దొరుకుతుంది. దీనికి పెద్ద అనే్వషణ అవసరం లేదు.
మనం ఎందుకు భయపడుతున్నామో చెప్పడానికి ఒక కారణం కావాలి. అది చాలా సులువుగా దొరుకుతుంది.
మనం ఎదుటివాళ్లని విమర్శించాలని అనుకుంటే ఒకటేమిటీ ఎన్నో కారణాలు దొరుకుతాయి.
ఇక్కడ మనం మరిచిపోతున్న విషయం ఒకటుంది. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి కూడా ఒక కారణం దొరుకుతుంది. ఆ దిశగా చూసే మనస్సు ఉండాలి.
ఈ మన ప్రపంచంలో ఓ చిన్న ఆశ కలిగించడానికి ఒక కారణం దొరుకుతుంది.
మంచి పని చేయడానికి కారణం దొరుకుతుంది.
ఆ మంచి పని చేయకపోవడానికి కూడా కారణం దొరుకుతుంది.
మనం దేని కోసం చూస్తున్నామన్నది అసలు ప్రశ్న.
ప్రతి దానికి ఓ కారణం ఉంటుంది.
కారణం వెతికి
మనం చేసిన పనిని సమర్థించుకోవడం చాలామంది చేస్తున్న పని.
ఒక వ్యక్తి జీవితంలో ఓ చిన్న మంచి మార్పు తీసుకొని రావడానికి కూడా ఒక కారణం ఉంటుంది.
ఆ దిశగా ఎంతమంది ప్రయత్నిస్తున్నారన్నది అసలు ప్రశ్న.