Others

సెల్ఫీలు తీస్తే జైలుకే! (వార్తా వ్యాఖ్య)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీలో స్వాతంత్య్ర దినోత్సవంనాడు- చారిత్రాత్మక ప్రదేశాల దగ్గర- సందర్శనీయ స్థలాలలోను ‘‘సెల్ఫీలు తీసుకుంటే కేసుపెడతామని హెచ్చరించారు గానీ, అహ్మదాబాద్ స్టేషన్లో, ఏరోజయినా ‘‘సెల్ఫీ’’ ఊసెత్తితే- వెంటనే తీసుకుపోయి ‘‘మూసేస్తా’’మంటూ ఉత్తర్వులు జారీచేశారు.
సెల్ఫీ పిచ్చి ముదిరి రైళ్లక్రింద పడిపోతున్నారు జనాలు. పులులు, సింహాల నోళ్లల్లో దూరిపోతున్నారు. వరదల్లో కొట్టుకుపోతున్నారు. మళ్లీ దీనికో స్టిక్కుకూడా వుంటుంది. ఇతర ప్రయాణీకులకెంత యిబ్బందో వారు గ్రహించరు. యిక అహ్మదాబాద్ ప్లాట్‌ఫామ్స్ మీద సెల్ఫీ ఆటగాళ్ల ఆటలు బంద్ అయిపోతున్నాయి- సెల్ఫీ స్టిక్కులు నాట్ అలోడ్! నిజంగా బాగుంటుంది అహ్మదాబాద్. మన బెజవాడ లాగా వంతెనలు, అతి రద్దీ, సందడి- అంతా బాగుంది గానీ సెల్ఫీలు మాత్రం రైలుపట్టా, రైలుబండీ అవీ పడేలాగా ఫొటోలు లాగిస్తే- 1969 రైల్వే చట్టం ప్రకారం ఐదేళ్లపాటు జైలుకుపోయే ఏర్పాట్లుచేశారు. నిజానికి విదేశాలలో ముఖ్యంగా కొరియా, ఉత్తర, దక్షిణ ప్రాంతాలలో సెల్ఫీల మీద ఆంక్షలు పెట్టేశారు. రకరకాల శిక్షలుపెట్టి హెచ్చరిస్తున్నారు. ‘‘సెల్ఫీల వ్యామోహంలో- ఫంక్షన్ ఫొటోలు తీసుకోడం కూడా మరిచి పోతున్నారు’’- అన్నాడో రైల్వే పోర్టర్. ‘బ్యాన్ ద సెల్ఫీ’అన్న ఫోరమ్స్ వస్తున్నాయి సిటీలలో జాగ్రత్త!!
***
రైల్వేకి తడిసి మోపెడైన ఖర్చు!
‘కాశ్మీర్ మనదేరా’అంటూ ఆగస్ట్ పదిహేనున వీరంగం వేశాంగానీ- రైల్వే డిపార్టుమెంట్ మాత్రం గోలెట్టేసింది. కాశ్మీర్‌లో రైళ్లు నడపటం ఎంత నష్టదాయకంగా వుందో ప్రకటిస్తూ- ‘‘ఇది మా పాలిట ఐరావతాన్ని మేపటంగా తయారైంది’’అంటూ వాపోయింది ఇండియాలో రైల్వే.
ఒకనాటి భూతల స్వర్గం- నేటి భూతాల నరకంగా మారిపోయిన కాశ్మీర్‌లో రైల్వేమార్గం ఎంతో లేదు. బనిహాల్ నుంచి బారాముల్లా దాకా 137 కి.మీ. దూరం మాత్రమే. కాకపోతే మరో యిబ్బంది అక్కడ రైలుబండ్ల డీజిల్ ఆయిల్ మీదే పరుగులు తీస్తాయి. ఎలక్ట్రిక్ కనెక్షన్లు లేవు. ఏటా రుూ కాస్త దూరం నిర్వహణకి ఇండియన్ రైల్వేస్‌కి- ఎనభై కోట్ల రూపాయల ఖర్చు అవుతోంది. ఐతే, చేతికి తిరిగి వచ్చేది (ఇన్‌కమ్) కేవలం పది కోట్ల రూపాయలే! మహాఅయితే రోజుకో ముప్ఫయి లక్షల రూపాయలు బిజినెస్ అంతే!
అక్కడ టెర్రరిస్టుల ఆగడాలకు రైలుబండ్లు, ఇంజన్‌లూ కూడా దెబ్బతినేస్తుంటాయ్. సిబ్బంది జీతాలకీ, యితర నిర్వహణకీ చేతి చమురు భాగోతమే అయిపోతోందిట. పైగా ఈ నెల రోజులుగా ఆందోళనకారులు రైలుస్టేషన్లను ధ్వంసంచేయడమే ధ్యేయంగా పెట్టుకున్నారు.
ఐననూ, కాశ్మీర్ మనదే కనుక రుూ నష్టం భరించాలి కదా?!-
**
మందుకొట్టి విమానం తోలవచ్చా?
సరే, హైదరాబాద్‌లో అందరికీ తెల్సు- గుర్రంమీద కూర్చుంటే కారు తోల కూడదు’’- అని.
కానీ విమానం ఆకాశం మీద కదా పోతుంది? దాన్ని తప్పతాగి పైలట్లు ఎగిరించవచ్చా?
‘కూడదు’- అన్న రూలు మన దేశంలో కూడా వున్నది కానీ పైలట్లు- ‘డోంట్ కేర్ మాస్టర్లు’- ‘‘మాకిష్టమైన లేడీ కోపైలట్ పార్టనర్‌గా వుంటేనే, ‘కాక్‌పిట్’లోకి ఎక్కుతాం’’అంటారు- కాస్త పుచ్చుకుంటే గానీ విమానాన్ని అంతరిక్ష మార్గంలోకి లేపరు. బి.ఏ. ఫేల్- అయితే శిక్షపడుతుంది అని తెల్సినా - వాళ్లకో తెలిసిన డాక్టర్(ఎయిర్ సర్వీసెస్‌లోనే) వున్నాడు. సర్ట్ఫికెట్ దొరికిపోతుందిట! (ఎంత మోసం?) బి.ఏ. అంటే ‘‘బ్రెత్ ఆల్కొహాల్ టెస్ట్’’. పైలెట్లు యితర ‘క్రూ’కి- విమానం ఎయిర్‌పోర్ట్‌లో దిగాక చేస్తారు.
ఆగస్టు తొలి, మలి వారాల్లో యిద్దరు వేర్వేరు విమానయాన చోదకుల్ని పట్టుకున్నారు. ఒకరు ఎయిర్ ఇండియాకి, ఇంకొకరు జెట్ ఎయిర్‌వేస్‌కి చెందినవారు. ‘నాలుగేళ్లదాకా విమానం జోలికి రావొద్దు’అంటూ పంపించేశారు. పైగా ఫిర్యాదులు నమోదుచెయ్యమని పోలీసులకప్పగించారు.
ఈ ఇద్దరూ సీనియర్లే. ‘షార్జా కాలికట్’ పైలెట్‌కి దుబాయ్, చెన్నై ఫ్లైట్లకు చెందినవారు.
ఇకమీదట చాలా స్ట్రిక్టుగా- మందు ప్రభావం పరీక్షలో కాస్త దొరికినా ఐదునెలల నుంచి ఐదేళ్లదాకా సస్పెండ్ చేసి, చాలా భారీగా జరిమానా, జైలుశిక్ష కూడా విధిస్తామని అధికారులు హెచ్చరించారు. ఈమధ్య ప్రతిరోజూ వందలాది ప్రయాణీకులతో ఏదో ఒక పెద్ద విమానం కూలిపోతూనే వుంది అన్న వార్తలు వింటున్నవారికి రుూ నిర్ణయం కొంత ఊరట, ధైర్యాన్నీ యిస్తుంది కదా!
***
ఆమె మంత్రి పదవి మటాష్!
తెల్లార్లూ ‘బార్లు’బార్లా తెరిచి పెడుతూ- ‘త్రాగొద్దు తప్పు’- అంటే ఎవరూరుకుంటారు గాని- తప్పతాగిన మైకంలోనే కాదు- మామూలుగా కాస్త పుచ్చుకున్న స్థితిలో కూడా, మోటారుకారు తోలకూడదు. మంత్రులు అయినా, వాళ్ల సంతానమైనా సరే, రుూ రూలు రూలే. ఇది మన దేశం వార్త కాదు-
స్వీడన్ దేశంలో ఒక యువ మంత్రిణి- కోపెన్ హాగెన్‌లో క్లబ్ డిన్నర్ ఆరగించాకా కారు ఎక్కి, జోరుగా, జోగుతూ కారు నడుపుకుంటూ పోతోంది ఆగస్టు 13 రాత్రి. ఆమె పేరు ఈదా హాద్ జియాలిక్. స్విస్ మంత్రివర్గంలో అతి పిన్న వయసులోనే, (24) ఉన్నత పాఠశాల విద్యామంత్రిగా, 2014లో నియమితురాలైంది. అంతేనా? వయోజన విద్యాశిక్షణ కూడా ఆమె శాఖలే గానీ- పదమూడు అర్ధరాత్రికి కొంచెం ముందు ఆమె కారును సరిగ్గా డెన్మార్క్‌కీ, స్వీడన్‌కీ మధ్యగల వంతెన మీద పోలీసులు ఈలవేసి మరీ ఆపేశారు.
‘‘అమ్మా! పుచ్చుకున్నారా?’’ అనడిగారు. ఊపిరి పరీక్ష చేశారు. ఎంత? 0.2 మి.లి. మాత్రం వుంది ఆల్కాహాల్. మన దేశంలో అయితే ఈ లెవెల్‌కి కారు తలుపుమూస్తూ - ‘‘మీరు పోవచ్చును’’- అంటారు. గానీ స్వీడన్ దేశంలో అదీ తప్పే! చాలా మనస్తాపం చెందింది మంత్రీమణి. జరిమానాతో పోయేదే గానీ, చాలా పశ్చాత్తాప పడిపోయి, విలేఖరుల సమావేశం పిలిచింది ఆమె.
‘‘నేను రాజీనామా చేస్తున్నాను. తప్పుచేశాను. శిక్ష అనుభవించాల్సిందే’’-నంటూ ప్రకటించింది. శ్రీమతి ఈదా బాస్నియా నుంచి వలస వచ్చిన ముస్లిం జాతికి చెందిన యువతి. 2014లో మిశ్రమ ప్రభుత్వంలో సభ్యురాలైన ఈ యువతి. సోషల్ డెమోక్రటిక్ పార్టీ సభ్యురాలు.
ఇదే మనదేశం అయితే మంత్రిదాకా ఎందుకు, మామూలు ఎం.పి.గారి పుత్రికారత్నమే- ‘‘నేనెవరో తెల్సా?’’అంటూ తర్జని చూపెడుతుంది.
‘‘త్రాగకండి. త్రాగినా డ్రయివింగ్ సీట్లో కూర్చోకండి’’అన్నది నీతివాక్యం!
****

-వీరాజీ