Others

మానవ ఆలోచనల్ని మలుపు తిప్పిన ‘ఆటోమేషన్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషి ‘శ్రమ’ను తగ్గించి, సమయాన్ని ఆదాచేసి, సేవలు అందించే, ఉత్పత్తిచేసే యంత్ర ప్రక్రియనే ‘ఆటోమేషన్’ అంటున్నారు. ఇందులో ‘వేగం’ అన్న మాట సైతం బలంగా ఇమిడి ఉంటుంది. అతి తక్కువ మానవ ప్రమేయంతో అతి ఎక్కువ ఉత్పత్తి, సేవలు అందించే ఈ ఆటోమేషన్ ప్రక్రియ ఇప్పుడు ప్రపంచమంతటా వేగంగా విస్తరిస్తోంది. రానున్న రోజుల్లో అన్ని రంగాలలోకి ఆటోమేషన్ ప్రవేశిస్తుంది. ఇళ్లు, ఆఫీసులు, ఫ్యాక్టరీలు, కర్మాగారాలు, సేవారంగాలు ఇలా అంతటా ఆటోమేషన్ అగుపించనున్నది. దీంతో మానవ జీవితం సంపూర్ణంగా రూపాంతరం చెందుతోంది.
ద్విచక్ర వాహనం గాని, కారు గాని వేగాన్నిబట్టి యాంత్రికంగా ‘‘గేరు’’ మార్చుకోవడం మనం చూస్తున్నాం. ఇందులో మానవ ప్రమేయం ఇసుమంత కూడా కనిపించదు. దీనే్న ‘ఆటోమేషన్’ అంటారు. ఈ రకమైన ప్రక్రియ ప్రతిచోటా ఆవిష్కృతమవుతోంది. హైదరాబాద్‌లో తిరుగుతున్న మెట్రోరైలు అంతా ఆటోమేషన్ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తోంది. మానవ ప్రమేయం అతి తక్కువగా ఉంటుంది. మానవులు అందించే సేవలకన్నా ఈ విధానంలో మెరుగైన సేవలు అందుతున్నాయి. కచ్చితత్వంతో రోబోలు పనిచేయడం కారణంగా ఉత్పత్తి గణనీయంగా పెరుగుతోంది. ఇది నూతన యుగపు ప్రత్యేకత. వర్తమాన పోకడ. దాంతో సమాజం సరికొత్త ‘లెవల్’కు చేరుకుంది. శ్రమ విభజనతో మెరుగైన రీతిలో యంత్రాలు పనిచేయడంవల్ల మొత్తం ‘‘మానవ జీవన సమీకరణం’’ మారిపోయింది. ఇంకా మారబోతోంది. విప్లవాత్మకమైన ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సాంకేతికత ఆధారంగా, మెషిన్ లర్నింగ్ ప్రక్రియ ద్వారా, సమాచార విప్లవం నేపథ్యంలో, ఇంటర్నెట్ ఇరుసుగా మానవ జీవన విధానంలో విశేషమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
కేవలం ఉత్పత్తి, సేవలే గాక ఆటోమేషన్ ద్వారా ‘‘స్మార్ట్‌హోమ్స్’’ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఈ గృహాల నిండా ఆటోమేషన్ టెక్నాలజీ కనిపిస్తోంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటి) పరిజ్ఞానం ఆధారంగా ఈ స్మార్ట్‌హోమ్స్ రూపుదిద్దుకుంటున్నాయి. ఇదంతా ఆటోమేషన్ విప్లవంలో అంతర్భాగమే. ఇందులో వైఫై, బ్లూటూత్, జెడ్‌వేవ్ లాంటి సాంకేతిక పరిజ్ఞానం కనిపిస్తుంది.
అమెరికాకు చెందిన ‘హోగర్ కంట్రోల్స్’ అనే ఆటోమేషన్ సంస్థ హైదరాబాద్‌లోని ఉప్పల్ ప్రాంతంలో తన యూనిట్‌ను వంద కోట్ల రూపాయలతో అతి త్వరలో ప్రారంభించనున్నది. ఆటోమేషన్ ఉత్పత్తులను ఆ యూనిట్‌లో తయారుచేస్తారు. దేశంలో ఇప్పటికే వివిధ ప్రాంతాలలో ఈ విధమైన ఉత్పత్తులు తయారవుతున్నాయి. అమెరికాలో తయారయ్యే ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నారు. కృత్రిమ మేథ దీనికి వెనె్నముకగా నిలుస్తోంది. భవిష్యత్‌కు ఓ కొత్త రూపం ఇచ్చే దిశగా ఈ ఆధునిక టెక్నాలజీ, డిజిటల్ మెషీన్లు పనిచేస్తున్నాయి. డ్రోన్లు, రోబోలు, పారిశ్రామిక రోబోలు మానవ జీవనానికి కొత్త నిర్వచనం చెబుతున్నాయి.
ఈ సరికొత్త విప్లవాన్ని కారల్‌మార్క్స్ అభిమానులు, ఆయన సిద్ధాంతాన్ని తలకెత్తుకునేవాళ్లు, ముఖ్యంగా మావోయిస్టులు గమనించకపోవడం విషాదం. మొదటి పారిశ్రామిక విప్లవం మొదలు మానవ ‘శ్రమ’ను సాధ్యమైనంతమేర తగ్గించి, సమయాన్ని ఆదాచేసి, మెరుగైన రీతిలో ఉత్పత్తి, సేవలు ప్రజలకు అందించాలన్న ఆకాంక్ష బలంగా కనిపిస్తోంది. గత రెండువందల సంవత్సరాల ఈ ఆకాంక్ష, అభిలాష అంబరాన్ని తాకుతోందిప్పుడు. కేవలం మానవ ‘శ్రమ’పైన ఆధారపడి ఆలోచనలు చేసిన కారల్ మార్క్స్ ఊహలు (సిద్ధాంతం) పూర్తిగా తలకిందులయ్యాయి. ఎందుకంటే మానవ శ్రమను పూర్తిగా తగ్గించి, సమయాన్ని గరిష్టంగా ఆదాచేస్తూ, నాణ్యమైన, చౌకగా వస్తువులు ఉత్పత్తిచేయడం, సేవలు అందించడమే లక్ష్యంగా ఆటోమేషన్ సాంకేతికత తన విశ్వరూపం ప్రదర్శిస్తుండగా మార్క్స్ ‘శ్రమ’ సిద్ధాంతం ఎక్కడ నిలుస్తుంది? నిజాయితీగా ఆలోచించే తత్త్వం మార్క్స్ అభిమానుల్లో కనిపించదు. ఆ తత్త్వమే ఉన్నట్టయితే మొత్తం ప్రపంచం మరోలా ఉండేది. కార్మిక - కర్షక లోకం మరింత మెరుగైన జీవితం గడిపేది. మానవ వనరులను, మానవ ‘శ్రమ’ను, సమయాన్ని గౌరవించకుండా, సరైన దృష్టికోణంలో వీక్షించకుండా విప్లవాల పేర విధ్వంసం సృష్టించడంవల్ల శ్రమజీవుల కొత్త తరాల జ్ఞానం ఆశించిన స్థాయిలో వృద్ధికాలేకపోయింది. దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నారు.
ఇప్పుడు ఆ సిద్ధాంత ప్రభావం ప్రపంచమంతటా మసకబారింది. మార్క్స్, ఆ అనంతరం వచ్చిన ఆయన సిద్ధాంత మద్దతుదారులకు పూర్తిగా దారులు మూసుకుపోతున్నాయి. అందులో ఒక కారణం ఆటోమేషన్. భారతదేశంలో ఈ ఆటోమేషన్ కొంత ఆలస్యంగా ఆరంభమైనా అభివృద్ధి చెందిన దేశాలలో ఇది అత్యంత కీలకపాత్రను పోషిస్తోంది. కృత్రిమ మేథ, ఇంటర్నెట్, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ లాంటి సాంకేతికత కారల్ మార్క్స్ కలలను గల్లంతు చేశాయి. కమ్యూనిస్టులు ఈ వాస్తవాన్ని ఇంకా గమనంలోకి తీసుకోకపోవడం దారుణం. మావోయిస్టులయితే మరింత మూర్ఖంగా మరణ మృదంగంతో, మందుపాతరలతో కారల్ మార్క్స్‌కు ‘జోహార్లు’ పలకడం ఎంతటి అజ్ఞానం?
మానవ చైతన్యాన్ని, గతిశీలతను సరైన వెలుతురులో దర్శించకుండానే గతి తర్క భౌతిక సూత్రాలంటూ తమను తాము వంచించుకోవడం విచిత్రం. ఆటోమేషన్ వల్ల మొత్తం సమాజ చలన గతుల్లో సంపూర్ణ మార్పు వచ్చిందని, జీవన సమీకరణాలు అనూహ్యంగా మారాయని స్పష్టంగా అవగతమవుతున్నాయి. పట్టింపు లేకుండా అశాస్ర్తియ రీతిలో, మానవుని సంబంధ బాంధవ్యాల పరీక్షలో విజయం సాధించని, కాలంచెల్లిన కారల్‌మార్క్స్ ఆలోచనల నుంచి దూరం జరిగి వర్తమాన ఆటోమేషన్ ఆవిష్కృతం చేస్తున్న చైతన్యాన్ని ప్రజలు అందిపుచ్చుకుని అడుగులు వేయడంలోనే అర్థం.. పరమార్థముంది.

- వుప్పల నరసింహం