Others

పుడమి తల్లి ఆవేదన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ మనిషి మేలుకో ! ఇకనైనా తెలుసుకో!
ఓ మనిషి
నీవు బ్రతుకవు , సంతోషంగా ఎవరినీ బతుకనివ్వవు
పుడమి తల్లినైన నా ఆవేదన
నాకోసం కాదు సుమా
బిడ్డవైన నీకోసమే

తెలుసుకున్నావా ? గుర్తించావా?
మరి నీ స్పందన ఏది ? కనబడడం లేదే?

‘కుహు కుహు’ అని పంచమ స్వరంలో శ్రుతి శుద్ధంగా పాడు కోయిల
అలసి, తన రాగ క్రీడను అర్థాంతరంగా చాలిస్తున్నదెందుకో?

వినువీధిలో తారల కాంతి పుంజము భూమిని తాకు తరి
అకాలమేఘములావరించి, అడ్డుకొన్నాయి ఎందుకో?

శశాంకునకు శాపమా అన్నట్టు నభోవీధిలో నల్లపూసై నాడెందుకో?
బాల భానుడి లేలేత కిరణాలు అగ్ని కణాలై వర్షిస్తున్నాయెందుకో?

చినుకు రాలితే కమ్మటి మట్టి వాసనను ఆఘ్రాణించు నాసిక
ఎప్పుడో రుచాస్వాదన కోల్పోయందెందుకో?

చిరువానకే చిగురుటాకులా వణికిపోతున్న పట్టణాలు
జల ప్రళయాన్ని సృష్టిస్తున్న దారులు చూశావా?

పల్లెలల్లో, పక్షుల కలకలారావంబులు మాయమయ్యనెందుకో?
జాతి, కుల, ప్రాంత భేదము లేని కొంగలు
నేలవాలడానికే జంకుతున్నాయెందుకో ?

చెరువులకు పోయె పరువు!
నదుల నాణ్యత ప్రశ్నార్థకమాయె?

పట్టణాలు నదులాయె, నదుల్లో పట్టణాలు వెలసె!
క్షీరామృతము నొసంగు గోఉదరం ప్లాస్టిక్కులతో నిండిపోయె!

భూమాతను కృత్రిమ ఎరువులతోనింపి
మట్టిని పిండి, మట్టిలో కలిపారెందుకో?

మాత్సర్యం లేని మత్స్యము ఉనికి కనుమరుగయ్యె
భయంకరమైన వ్యర్థాలు హేయమైన పదార్థాలు
కడలి గర్భంలో తోసి జల జీవరాశుల హంతకుడవైనావెందుకు?
జలధిలో నీవు నింపిన పదార్థ విజ్ఞానం
నీకు సమాధాన మిచ్చు రోజు దగ్గరపడె!
నాడు
గరళకంఠుడు తాను కాలకూటము
మింగి త్రినేత్రుడయి అవనికి ఆనందం గూర్చె
నేడు
మనిషి అనే ముసుగు ధరించి
రక్కసుడు అవనికి విషమిచ్చి ఆనందించె!
ఎటు చూసినా విధ్వంసకర అణ్వాయుధాలు
వాతావరణ గతులుమారి తే మనగతేమి?
ప్రకృతిని వికృతి చేసి, విలయ తాండవమునకు
నాందీ పలకిన మనిషీ ! ఇకనైన మేలుకో...

- కె. రఘునాథ్ 9912190466