Others

భక్తి భావనతోనే స్థితప్రజ్ఞత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోరిక బలవత్తరమైంది. ఆ కోరిక వల్లనే అనేక కష్టనష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. సాధారణంగా కోరిక వల్ల దుఃఖమే కలుగుతుంది కనుక కోరికలను దూరం చేసుకోమని అని బౌద్ధ్ధర్మం చెప్తుంది. ఆశలు ఆడియాసలైనప్పుడు దుఃఖమే గతి కదా అని హైందవ ధర్మం కోరికలను అదుపు చేసుకోమని చెప్తుంది.
కోరికలు అనేవి ఒకదాని తరువాత మరొకటి వస్తూనే ఉంటాయ. అసలేమీ కోరికలు లేవు అనుకుంటూనే మరొక కోరికకు దగ్గరవడం సాధారణమైన మనుష్యులకు అనుభవంలోనిదే. కనుక మనకున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మనకు కలిగే కోరికలు ఎంత అవసరమైనవా, అనవసరమైనవా అనే విచక్షణ తో ఆలోచించి కోరికలు అదుపులో పెట్టుకోవడం ఉత్తముల లక్షణం.
కోరికలు జయంచడం కూడా అంత తేలిక కాదు. విశ్వామిత్రుడు రాజుగా ఉన్నపుడు మహర్షి అయన వశిష్ఠుని చూశాడు. కామధేనువు విషయంలో వశిష్ఠుని మంత్ర బలం ముందు విశ్వామిత్రుని సైనిక బలం వెలవెలపోయంది. దానితో విశ్వామిత్రుడు తాను కూడా ఆ మంత్రబలాన్ని సాధించాలనుకొన్నాడు. తాను వశిష్ఠుని లాగే బ్రహ్మర్షి కావాలనుకొన్నాడు.
కాని ఒకసారి శునశే్శపుని వల్ల, మరొక సారి మేనక వల్ల, ఇంకొంక సారి త్రిశంకుని వల్ల తన తపశ్శక్తిని పోగొట్టుకున్నాడు. కాని చివరకు కోరికలన్నీ త్యజించి లోకకల్యాణమే మంచిది అని తెలుసుకొన్న తరువాత ఆయన బ్రహ్మర్షి అయ్యాడు. దీనికి ఎన్నో వేల యేండ్లు తపస్సును చేశాడు.
కిందముడనే వ్యక్తి కూడా తపస్సు ద్వారా ముక్తిని పొందాలనుకొన్నాడు. కానీ ఇంద్రియాలను జయంచ లేక కోరికను చంపుకోలేక మునివృత్తి అవలంబిస్తూనే తన సతితో మృగరూపంలో అపుడపుడు విహరించే వాడు. ఆ సమయంలోనే పాండురాజు వేటకు వచ్చాడు. ఈ విషయాలేవీ తెలియక తన వేటను కొనసాగిస్తూ మృగాలుగా మారిన కిందముడిని తన బాణాలతో చంపివేశాడు. కోరిక తీరకుండానే కిందముడు చనిపోయే సమయం వచ్చింది. తనకీ గతి పట్టించిన వాడు పాండురాజు అని తెలుసుకొని పాండురాజు తన లాగే భార్యతో కూడి ఉన్నపుడు చనిపోతావని శపించి కిందముడు చనిపోయాడు. తపస్సు అంతా వ్యర్థమైపోయంది. ఇదంతా కేవలం కోరిక తీరకపోవడం వల్ల జరిగిన అనర్థమే.
పాండురాజు కూడా తన శాపం తెలుసుకొని కూడా కోరికను అణుచుకోలేక మాద్రితో కలిసి ఉన్నపుడు మునిశాపం వల్ల చనిపోయాడు.
వాళ్లంతా గొప్పవారు వారే కోరికలను అదుపులో పెట్టుకోలేక నానావస్థలు పడ్డారు. ఇక సామాన్యులు సంగతి. అందులోను కోరికలను అదుపులో ఉంచుకోవడంఅనేది చాలా కష్టమైన పని. అందుకే ప ండితులు పెద్దలు కోరికలను జయంచడానికి ఒక మార్గం చూపారు. అదేమిటంటే భగవంతునిపై భక్తిని పెంచుకుని తమకు ఇచ్చేవాడు పరమేశ్వరుడే నని మనసును స్థిరం చేసుకోవాలి. ఆ పరమేశ్వరుడు కూడా చేసే పనినంతా ఈశ్వరార్పణం చేసి కర్తవ్య నిర్వహణ చేస్తే భగవంతుడు మనకు ఎపుడు ఏమి ఇవ్వాలో అపుడు దాన్ని ప్రాప్తింపచేస్తాడు. ఈ భావన మనసున నాటుకుంటే కోరికలు అదుపులో ఉంటాయ. కోరికల వల్ల జరిగే అనరాథలు థూరమవుతాయ. కనుక ప్రతివారు పరమేశ్వరునిపై భక్తి అనే బీజాలను మనసున నాటుకోవాలి.

- చివుకుల రామమోహన్