Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏమిటొ ఆ అద్భుతమ్ము? ఏమిటొ ఆ గారడియును!
రంగులన్ని మాయవౌచు ఎరుపొక్కటె మిగిలెను!

అరుణుండే అర్ణవమై ఆకసమున నిండినట్లు
ఎటుజూచిననటు ఎరుపే! కుంకుమారబోసినట్లు

పదమునుండి పద్మమొకటి మొలచినటుల పైన పదము
పదమునుండి పద్మమొకటి జారినటుల క్రింద పదము

ఎటుజూచిన నటుపదమే! పదము వీడి పోవుటెట్లు?
ఎటుజూచిన నటురాగమె! రాగము వీడుట యెట్టులు?

ఎర్రనైరి రవిచంద్రులు! ఎర్రనాయె తారకలు!
పొట్ట వ్రీలినటుల విశ్వమెర్రనౌచు తోచెను!

చాలునెట్లు కనులు రెండు ఆ లీలల గాంచుటకు?
చాలునెట్లు కరద్వయమ్ము ఆతని ప్రణమిల్లుటకు?

తల్లి గర్భమున నుండిన పిండమటుల నృపుడుండెను
గర్భము తక్కను అన్యమ్మేవిధి కనిపించును?

గర్భమ్మున దాగు ప్రాణి తల్లిమాట వినినట్టుల
వినసాగెను నృపుడంతట ప్రభువు పలుకు పలుకుల.

అపుడు రేడు విస్మితుడై మోడ్చెను తన కరములను
నతమస్తకుడై యంతన పలికె నార్ద్ర స్వరమునను.
ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087