Others

నైషధమ్ (హంస దౌత్యం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎల్లప్పుడూ నలునినే తలుచుకొంటూ పిచ్చిదానివలె కనిపిస్తూ ఉన్నది. రాత్రింబవళ్ళు నిద్రకు స్వస్తిచెప్పింది. ఒకచోట కూర్చోకుండా, ఒకచోట పడుకోకుండా భోగాలను అనుభవించే విషయంలో ఆసక్తిచూపడం మానివేసింది. ఒక్కొక్కప్పుడు వెక్కివెక్కి ఏడ్వటం మొదలుపెట్టింది.
అలా కృశించిన దమయంతిని పరిశీలించి, ఆమె అస్వస్థతకు కారణాన్ని గమనించారు చెలులు. వెంటనే విదర్భ దేశాధిపతి అయిన భీమమహారాజు వద్దకుపోయి విషయాన్ని విన్నవించి...
‘‘ప్రభూ! దమయంతి ఆ రాజహంస వచ్చివెళ్ళినప్పటినుండి ఆ హంస చెప్పిన మాటలనే వల్లెవేస్తూ మాతోకూడా మాట్లాడటం మానివేసింది. ఏ పనీ చేయకుండానే ఊరకే అలసిపోతుంది. ప్రతి దినం యెట్టి సౌఖ్యాలనూ ఆశించటం లేదు. ఆభరణాలపై గానీ, ఆహారాలపై గానీ అభిలాష సన్నగిల్లింది. శయనించటానికి కూడా మంచి శయ్యనూ ఆశించటం లేదు. అలా నిద్ర లేకుండా ఎన్నో రాత్రులు, పగళ్ళు గడిపింది. ఎల్లప్పుడూ ఆ నలుని గురించే స్మరిస్తూ విరహతాపంతో కృంగి కృశించింది.
ఓ మహారాజా! ఇతర రాజులు ఎంతటి సంపద కలవారైనా, ఎంతటి గొప్ప గుణగణాలు కలవారైనా వారి విషయం ఎంతమాత్రం వినటానికి ఇష్టపడటం లేదు.’’ అని మొరబెట్టుకున్నారు.
దమయంతి సఖులు చెప్పిన మాటలు విన్న భీమరాజు తన తనయ నలుని ప్రేమిస్తున్న విషయాన్ని గ్రహించాడు. తనలో
‘‘నేనేమి చేయగలను? ఆ నలమహారాజును ఏ ఉపాయంతో ఇచ్చటికి రప్పించగలను?’’అని ఆలోచించాడు. యుక్తవయస్సు వచ్చిన పుత్రిక గురించి చింత చెందాడు. మంత్రులతో సంప్రదించి చివరకు ఒక నిర్ణయానికి వచ్చాడు. దమయంతికి వెంటనే స్వయంవరాన్ని ప్రకటించాడు.
ఇదొక్కటే నలుని రప్పించటానికి తగిన ఉపాయం అని తలపోశాడు.
వీరులైన వారంతా దమయంతికి జరుగబోయే స్వయంవరానికి విచ్చేసి, ఆ స్వయంవర సందర్శనానుభూతిని పొందవచ్చని సకల రాజలోకాన్నీ భీమమహారాజు ఆహ్వానించాడు.
స్వయంవర వృత్తాంతాన్ని విన్న రాజులందరూ విచిత్రాలైన దండాలూ, చూడముచ్చటైన ఆభరణాలను ధరించి, చక్కగా అలంకరింపబడిన తమతమ రథ అశ్వగజ బలాలతో విదర్భకు బయలుదేరారు. స్వయంవరానికి విచ్చేసిన మహారాజులంతా భీమమహారాజుచేత సత్కారాలనుపొంది విదర్భ నగరంలో విడిది చేశారు.
లోక సంచారం చేసే నారద, పర్వత మహర్షులు స్వర్గలోకానికి వచ్చారు. స్వాగతాన్ని పొందారు. దేవేంద్రుని భవనంలోనికి ప్రవేశించారు. నారద, పర్వతులను ఇంద్రుడు గౌరవించాడు.
వారిని చూచి దేవేంద్రుడు ‘‘నారద, పర్వత మహర్షులారా! మీకు క్షేమమేగదా? అని అన్నాడు.
‘‘దేవేంద్రా! మా ఇరువురమూ క్షేమమే! అన్ని విషయాల్లోనూ కుశలమే! అంతేకాదు దేవేంద్రా! భూలోకంలో రాజులందరూ కూడా క్షేమంగానే ఉన్నారు’’అని అన్నాడు నారదుడు.
‘‘నారద మహర్షీ! యుద్ధంచేస్తూ మరణించిన ధర్మజ్ఞులైన రాజులు, శస్త్రంచే మరణం సంభవించినప్పుడు పరాఙ్మఖులు కానివారు, నావలె శాశ్వితంగా ఈ లోకంలో నివసిస్తారు. అలాంటి పరాక్రమం గలిగిన రాజులు క్షత్రియులు ఎక్కడ ఉన్నారో నాకు కన్పించడం లేదు. ఇష్టులై అతిథులుగా వచ్చే రాజులలో కూడా అట్టి శూరులు కనిపించుట లేదు’’ కారణమేమి అని దేవేంద్రుడు నారదుని ప్రశ్నించాడు. దేవేంద్రా! నీ ప్రశ్నకు నేను సమాధానం చెబుతాను. శూరులైన మహారాజులెవ్వరూ కనిపించకుండా ఉండటానికి కారణం వినుము. విదర్భ దేశాధీశుడైన భీమమహారాజుకు దమయంతి అనే అతిలోక సుందరి అయిన ఒక పుత్రిక ఉన్నది.
- ఇంకాఉంది

త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము