Others

ప్రణతింతు.. ప్రస్తుతింతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శివశివారుణాచలవాస! శివహర భవ
నిన్ను నమ్మితి నా మది నిలచి నన్ను
కరుణఁ జూపుచు కావవే కాలకంఠ
పాహిమాం పరమేశ్వరా! పార్వతీశ!
భావం: ఓ అరుణాచలవాసా! శంకరా! నినే్న నమ్ముకున్న నా హృదయమందు నిలచి కరుణతో నన్ను కాపాడు తండ్రీ!
కష్టనష్టాల కడలిలో ఁ గాలమంత
కొట్టుకొని పోవుచుండెనే యెట్టులైన
వాటినిం దొలగింపవె మేటి దొరవు
పాహిమాం పరమేశ్వరా! పార్వతీశ!

భావం: శంకరా! నా జీవితకాలమంతాకష్టనష్టాల కడలిలో కొట్టుకుపోతోంది స్వామీ. ఎలాగైనా వాటిని తొలగించి కాస్త ఉపశమనాన్ని కలిగించవయ్య. గొప్ప దైవానివి కదా.
హరహరా! వెండికొండపై హాయినొంది
నీ సతీసుతులంగూడి నిత్యసుఖము
లందు చుంటివే ! మాగతి! లయకరుండ
పాహిమాం పరమేశ్వరా! పార్వతీశ!
భావం: హరహరా! స్వామీ కైలాస గిరిపై జనని పార్వతమ్మ నీ కుమారులైన వినాయక కుమార స్వాములతో కూడి నిత్యసుఖాలనుభవిస్తున్నావే! నా గతి ఏమిటి ప్రభూ!
ఈశ్వరా! శివా! హరహరా! ఎన్నిచిక్కు
లంబడినఁ గాని యత్యంత లాఘవముగ
వీడిపోవును నిను ఁ దల్వ వేడుకున్న
పాహిమాం పరమేశ్వరా! పార్వతీశ!
భావం: ఈశ్వరా! శివా! హరహరా! ఎన్ని చిక్కులు వచ్చిపడినా నిన్ను తలచుకున్నా వేడుకున్నా ఎంతో తేలికగా తొలిగిపోతాయి శంకరా!
ఓ శివా! ఫణిభూషణా! రాశిఁ బోసి
నిన్ను బూజింప ఁ బెన్నిధి ఁ గాననట్టి
వాడనే జలంబులతోడ ఁ బల్కరింతు
పాహిమాం పరమేశ్వరా! పార్వతీశ!
భావం: ఓ ఫణిభూషణా! శివా! ధనరాశులు పోసి పూజించడానికి నా వద్ద పెన్నిధి లేదే! అందుకే జలలాలతోటే నిన్ను పల్కరిస్తున్నానయ్య.

వ్యాకులతలొక్కపెట్టుక వచ్చి పడియె
తాళలేకుంటినో హరా! తాపమడచి
మదికి శాంతిని యొనగూర్పుమయ్య దేవ
పాహిమాం పరమేశ్వరా! పార్వతీశ!

భావం: ఎన్నో వ్యాకులతలతో తాళళేకపోతున్నాను హరా! నాలోని తాపమణచి వేసి నా మనస్సుకు శాంతిని ప్రసాదించవయ్య,
భక్తతుతులన్న నీకు సయిరము గనుక
వారి సేమమ్ము దలచెడి వాడవీవు
దయకుఁ బట్టమ్ము గట్టిన దైవమీవు
పాహిమాం పరమేశ్వరా! పార్వతీశ!

భావం: ఓ శంకరా! నీ భక్తులంటే నీకెంతో సంబరం. అందుకే వారి క్షేమాన్ని గూర్చే ఆలోచించే వాడవు. దయకు పట్టం గట్టే గొప్ప దైవానివి నీవే స్వామీ.
కోటి లింగేశ్వరా ! జీవకోటికీవు
రక్షవై యసంఖ్యాకవౌ మోక్షమార్గ
ములను నీరిడఁ జూపింతు విలను ఁ గాంచ
పాహిమాం పరమేశ్వరా! పార్వతీశ!

భావం: కోటి లింగేశ్వరా స్వామీ! సకల జీవకోటికీ నీవే రక్ష! కొంత నీటినిస్తే చాలు అసంఖ్యాకమైన ముక్తిమార్గాలను ప్రసాదిస్తావు స్వామీ!
శుభ ప్రదుడ వీశ! శంభుడా! శోభ గూర్తు
విండ్ల నీభక్తులన్నను వెల్లువెత్తు
సంపదలలరారు మహేశ! శరణమయ్య
పాహిమాం పరమేశ్వరా ! పార్వతీశ!
భావం: ఓ శంభు మూర్తే ఇళ్లల్లో నీ భక్తులున్నచో శోభగూర్చి పెడతావు. అలాంటి నీభక్తుల ఇళ్లల్లో సకల సంపదలు వెల్లువెత్తుతాయి స్వామీ!
తపము సేయంగ వౌనుల దారిఁబట్ట
లేను సంసారమను సాగరాన మునిగి
తేలకుంటిని దారేది దివ్యలింగ!
పాహిమాం పరమేశ్వరా! పార్వతీశ!
భావం: ఓ దివ్యలింగమూర్తీ ! తపస్సు చేయడానికి మునుల మార్గాలను అనుసరించలేనయ్య. అందుకు గల కారణం సంసారసాగరంలో పూర్తిగా మునిగి తేలలేక పోతున్నాను. దారీ తెన్నూ తోచడం లేదు స్వామీ.
జ్ఞాన శూన్యుడనై యిలఁ జతికిలఁ బడి
పోయినాడను జ్ఞానమ్ముఁ బూర్ణమొసగి
మనిషి నిం జేయఁ గోరెద మామహేశ!
పాహిమాం పరమేశ్వరా ! పార్వతీశ!
భావం: ఓ పార్వతీపతీ! జ్ఞాన శూన్యుడనై చతికిల బడి పోయాను. సంపూర్ణ జ్ఞానాన్ని ప్రసాదించి నన్నో మనిషిని చేయవలసిందిగా కోరుతున్నాను స్వామీ!

స్వజనులందరి నో కంట ఁ జల్లగాను
చూడుమో మంగళప్రదుడ! మోడు వారు
జీవితాలను ఁ జిగురింప ఁ జేయుమయ్య
పాహిమాం పరమేశ్వరా! పార్వతీశ!
భావం: ఓ పరమేశ్వరా! స్వజనులందరినీ ముక్కంటి వైన నీవు ఓ కంట చల్లగా చూడవయ్య. మోడు వారిన జీవితాలను చిగురింపజేయుము శివా!
భూతిరైశ్వర్యమని యెంచి బూసినాను
తీసి రుద్రాక్ష మాలను వేసినాను
మురితిని రుద్ర చిహ్నాల మెఱయుచుంటి
పాహిమాం పరమేశ్వరా! పార్వతీశ!

భావం: ఓ పరమేశ్వరా! విభూతి సర్వ ఐశ్వర్యాలను కలుగచేస్తుందని దలచి ఒంటినిండా పూసుకున్నాను. రుద్ర చిహ్నాలతో మురసిపోతూ రుద్రాక్షలను ధరించి మెరిసి పోతున్నాను శంభుమూర్తీ ! నన్ను కాపాడు స్వామీ!

- కొడుకుల సూర్య సుబ్రహ్మణ్యం 9492455762