Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఆగుమాగు మోయి స్వామి! ఆగుమింక స్వామీ!
ఈ భక్తుని కరుణించగ ఇంతటి శ్రమయేల స్వామి?

ఇరుపదముల నిహపరముల నాక్రమించినావు స్వామి!
నా తలయే మూడవదగు అడుగు నిడుడు స్వామీ!

చీమకడకు కొండవోలె నీవు వచ్చినావు స్వామి!
చీమకు కైలాస శిఖర మేవిధి కనబడు స్వామీ!

నీ రూపును నేజూడగ సాధ్యవ్మౌ నాకెట్టుల?
నా కన్నులనావ లోన నీ కన్నుల జేరుటెటుల?’’

అని పలుకగ ఆర్తితోడ విని దేముడు వేవేగమె
మెచ్చెనతని, యిచ్చెనంత దివ్యవ్మౌ చక్షుయుగమె

వచనం: అప్పుడా వామనుడు గగనమంతా విస్తరింపజేసిన తన పాదాన్ని కుంచింపజేసి, తన కాలిని గగనంలోనుండి తీసి, బలి తనపై నుంచాడు. అప్పుడా దృశ్యం ఇలా కనిపించింది.
ఆకసమునున్న పదము కుంచించుకు పోసాగెను
కాసారము నడుమనున్న పూవు మొగ్గగా మారెను.

పూవు చుట్టు అంచువోలె అపుడె నీలిమము మొలిచెను
ఆ యంచే పెద్దనౌచు ఆకాశమ్మాయెను.

పద్మమొకటి తలక్రిందుగ జారెననగ జారెను
పద్మమె నిశ్శబ్దమ్ముగ భూమిపైకి దిగెను.

ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087