Others

నైషధమ్ (హంస దౌత్యం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూమండలంలోగల స్ర్తిలందరినీ దమయంతి తన రూప సంపదచే మించిపోయింది.
మహేంద్రా! ఆ దమయంతికి భీమమహారాజు స్వయంవరాన్ని ప్రకటించాడు. ఆ స్వయంవరం త్వరలో జరుగనున్నది. మహారాజులు, రాజపుత్రులు అందరూ అటు పయనమవుచున్నారు. ప్రపంచానికే మణిరత్నమైన ఆ దమయంతిని మహారాజులంతా తమ్మువరించాలని కోరుచున్నారు. తమలోని అన్యోన్య వైరాలు, అభిప్రాయ బేధాలు ఉజ్జగించి ఉత్సాహంతో, వేడుకతో మిక్కిలి స్నేహంతో ఉంటున్నారు’’ అని నారద మహర్షి చెబుతున్న సమయంలో...
అసుర శ్రేష్ఠులైన లోకపాలురు అగ్నిదేవునితో కలిసి అచ్చటికి వచ్చారు. నారదుడు చెప్పే మాటలను విన్నారు. వారు సంతోషంతో
‘‘మనంగూడా ఆ స్వయంవరానికి వెడదాము’’అని అన్నారు.
అంత ఇంద్రుడున్నూ, దిక్పాలకులున్నూ దమయంతి స్వయంవరాన్ని చూచే వేడుకతో రత్నాలు పొదగబడిన అందమైన పసిడి విమానాలను ఎక్కి బయలుదేరారు.
మహారాజులెందరో స్వయంవరానికి వచ్చారని విని ఆత్మస్థైర్యంతో ధమయంతిని పొందాలని నలమహారాజుగూడా బయలుదేరాడు.
భూతలానికి చేరుతున్న ఇంద్రాగ్ని యమవరుణులు మార్గమధ్యంలోనే నలమహారాజును చూచారు. సూర్యులలో విష్ణువువలె మిక్కుటమైన కాంతితో వెలుగొందుచున్న అతడి సర్వావయవ సౌందర్యానికి ఆశ్చర్యపడి విగత సంకల్పులై నిలిచారు. తమ విమానాలను అంతరిక్షంలోనే వదలి, భూతలానికి దిగివచ్చారు. నలుని చెంతకువచ్చి నిలబడి నలునితో ‘‘ఓ నిషధ మహారాజా! ఎల్లప్పుడూ నీవు సత్యవ్రతాన్ని పాటిస్తావు. నీలాంటి రాజులు అరుదు. నీవు మాకు కొంత సహాయము చేయాలి. మాకు అనువైన దూతగా మా అభీష్టం నెరవేర్చాలని కోరుచున్నాము’’ అని అన్నారు.
‘‘అలాగే చేస్తాను’’అని నలుడు వారికి నమస్కారాలు చేసి వినయంతో.
‘‘మహానుభావులారా! మీరెవరు? నేను మీకు ప్రియమొనరించటానికి, మీకు ప్రతినిధినై ఏ కర్తవ్యాన్ని నెరవేర్చవలెనో సెలవిండు! ఉన్నదున్నట్లు విషయాన్ని చెప్పండి’’అన్న ఆ నలుని మాటలకు దేవేంద్రుడు...
‘‘ఓ నలమహారాజా! నేను దేవేంద్రుడిని. నాకాధిపతిని. వీరు నా సహచరులైన దిక్పాలురు. సుప్రసిద్ధులు. ఈతడు అగ్నిదేవుడు. ఇతడు వరుణుడు. ఇతడు యముడు. మేము భూలోకంలో జరుగుచున్న దమయంతి స్వయంవరాన్ని చూడ వేడుకతో విచ్చేసి ఉన్నాము.’’
‘‘లోక పాలకులైన ఇంద్రాగ్నియమ వరుణులు నిన్ను చూడాలనే కోరికతో స్వయంవరానికి వచ్చారని దమయంతితో చెప్పాలి. మా గురించి పద్మదళాయతాక్షి అయిన ఆ దమయంతికి మమ్ములను పేర్లతో, బిరుదు నామాలతో ప్రశంసాపూర్వకంగా పరిచయం చేయాలి. వారు నిన్ను పొందాలని కోరుచున్నారు. వారిలో ఒకనిని భర్తగా వరింపుమని కూడా చెప్పాలి. ఆ విధంగా నీవు దౌత్యం నెరిపితే ఆ సుకుమారి దమయంతి తన ఇచ్చవచ్చిన వాడిని మాలో ఒకరిని వరుడిగా ఎన్నుకొంటుంది’’ అని అనగా నలుడు ఇంద్రునికి నమస్కరించి
నాకాధిపతీ! దేవేంద్రా! మీరూ, నేనూ ఒకే ప్రయోజనం ఆశించి వచ్చాము. ఆ విషయం మీకు సంపూర్ణంగా తెలిసినదే. అటువంటప్పుడు ఈ పనికి మీరు నన్ను వినియోగించడం న్యాయమా? ఒక స్ర్తిని పొందాలని మనసుపడి ఆశించిన పురుషుడు ఆ స్ర్తిని విడిచిపెడతాడా? ఈ విధమైన దౌత్యం న్యాయమా? దేవతలు మీరు! ఈ విషయంలో నన్ను క్షమించాలి’’ అన్నాడు.
‘‘నీవేకదా మేము ఏ విషయాన్ని అర్థించినా చేస్తానని ఉత్సాహంతో మాట ఇచ్చావు! ఆడిన మాట నీవెలా తప్పగలవు? నీవు సత్యసంధుడవని తెలుసు. ఈ కార్యం నిర్వహించగలిగే శక్తిసామర్థ్యాలు నీకు కలవని కూడా మాకు తెలుసు.