Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బలితలపై మోపుటకై వామనుడెత్తెను పాదము
అది పాదమ్మన నొప్పునె? అభయామృతహస్తము.

ఒక కుంకుమ రాశి యనగ- ఒక పగడపు దీవి యనగ
ఒక మంగళహారతి యన- దివ్యాంగన చెక్కిలియన

ఒక ఎర్రని మణులరాశి- ఒక పెదవుల రాగమ్ము
ఒక దివ్వెల తోరణమ్ము- ఒక చందన సౌందర్యము

ఒక మణిమయ విలాసమ్ము- ఒక బంగరు కిరీటమ్ము
ఒక తేజోపుంజమ్ము- అనదోచెను పాదమ్ము.

బలితలపై మోపెనటుల వామనుండు పాదం
తల పెరిగెను తలపులతో- చిన్ననాయె పాదం.

మెరిసెనంగ చంద్రనివలె - మెరిసెనంత నృపుడు
తలపై బంగరు మకుటం దొడిగెననగ యినుడు.

తలపై పాదము నిలిచెనా? నిలిచెనా పద్మమ్ము?
తనువొక కాసారమనగ తల తామర తూడన!

ఏమి జన్మమేమి జన్మ? జన్మయనిన బలిదే!
ఏమి వరం? ఏమి వరం? వరమన్నను బలిదే!

బ్రతుకంతయు పదముకొరకు వెదకును లోకమ్ము
కాని, వెదకి కొంచు వచ్చి బలిని చేరె పదమ్ము
ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087