AADIVAVRAM - Others

సాధకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాలే వర్షపు నీటిచుక్క బీడును తడిపినా
మోడుపై చిలికినా ఆశలు ఫలియించునా.. ఆశయం చిగురించునా
జారే కన్నీటి చుక్క గుండె మంటలార్చునా..
మదినోదార్చునా.. ఊరట కలిగించునా..
ఎదలో దుఃఖం ఉపశమించునా..
శూన్యాకాశంలో తళుకుమనే తారకలు మాయమై
నిశీధిని తలపునకు తెస్తూ కటిక చీకటి నిండిన
జీవితమొక కథయై కలయై కదలని శిల్పమై
ఆశలుడిగిన మనిషి మనుగడ దుర్భరమై
శూన్యానికి ప్రతీకయై.. ఆశావాదం నశించి
మనిషి ఆసాంతం కృశించి దహించుటయేనా!!
జీవితం ముగియుటయేనా!!
కాదు కాదు కాదు.. ముమ్మాటికి కాదు..
కాలమెంత కలసి రాకపోయినా.. తిమిరమెంత
ఆక్రమించినా.. హృదయమెంత
పెను శోకాన రోదించినా..
దీక్షను సడలించక.. దక్షతను పెంపొందించుక
ఒడలు విరిచి అలుపు మరచి గనులు తొలిచి
ఖనిజ నిధులను జాతికందించిన కార్మికుడై..
శ్రామికుడై.. సముద్రపు లోతులకు వెళ్లి
రత్నరాసులను జాతీయతకై భద్రపరచు
భారతీయుడై.. రణతంత్రుడైనవాడే
మానవుడు మహనీయుడు
జై కిసాన్.. జై జవాన్.. నినదిస్తున్నది
ఈ భారత జమీన్.

-ఆచార్య క్రిష్ణోదయ 74168 88505