Others

సూర్యకాంతం.. పాదాభివందనం ( ఆనాటి హృదయాల..)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సావిత్రి డైలాగులు చెబుతున్నపుడు తన డైలాగులు మరచిపోవడం, ఒక్కోసారి సావిత్రి నటించినపుడు ఉక్కిరిబిక్కిరై ఏడ్చేస్తూ.. ఆ దుఃఖంనుండి తేరుకోలేకపోవడం జరిగేది. హెవీ సీన్సు చేస్తున్న సావిత్రి అవలీలగా చేసేస్తే.. చిన్న చిన్న డైలాగులు చెప్పవలసిన సూర్యాకాంతమ్మ దాట్లు వెయ్యడం అందరికీ ఆశ్చర్యంగా అనిపించేది.

మహానటి సావిత్రి జీవితంలో కలికితురాయిలాంటి చిత్రం ‘రక్త సంబంధం’-.
ఇదే చిత్రం తమిళంలో ‘పాశమలర్’గా నిర్మించారు. అందులో అన్నా చెల్లెళ్లుగా శివాజీ గణేశన్, సావిత్రి నటించారు. ఆ సినిమాకి తమిళ దర్శకుడు భీమ్‌సింగ్ (సుకుమారి భర్త). తెలుగులో వి మధుసూధనరావు. విక్టరీ మధుసూధనరావుకు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే -ఏ చిత్రాన్నైనా రీమేక్ చేసేటపుడు చాలా జాగ్రత్తలు తీసుకొనేవారు. స్వతహాగా గొప్ప విమర్శకుడు. ఎడిటింగ్, ఛాయాగ్రహణం శాఖల పట్ల అమితమైన ఆకర్షణ గలవాడు కనుక వి మధుసూధనరావు చిత్రం పికాసో పెయింటింగ్‌లా ఉంటుంది. నటీనటుల హావభావాలు తనూహించిన విధంగా లేకపోతే దూర్వాసుడిలా మండిపడిపోయేవారు. సెట్‌లో తిట్లూ, కొండొకచో కొట్టడాలూ సర్వసాధారణం. అటువంటిది ఈ సినిమా సన్నివేశాలు చిత్రీకరిస్తున్నప్పుడు మంత్రముగ్ధుడిలా అయిపోయి.. కట్ చెప్పడం మరిచిపోయిన సందర్భాలు చాలావున్నాయి. అంత అద్భుతమైన నటన కనపర్చేవారు యన్టీఆర్, సావిత్రి. ముఖ్యంగా సావిత్రి తమిళంలో ఆల్రెడీ చేసి వుంది కాబట్టి ఆ పాత్రకి ప్రాణప్రతిష్ఠ చెయ్యడంలో నిమగ్నమై పోయింది.
ఈ సందర్భంగా సూర్యకాంతమ్మ చెప్పిన చిన్న ముచ్చట్లు మీతో పంచుకుంటా. సూర్యకాంతమ్మ షూటింగుకి వచ్చిందంటే తనతోబాటు రెండు కారియర్లు రావలసిందే.. ఆ రెండు కారియర్‌లలో తినుబండారాలూ, పిండి వంటలూ నింపుకురావడం.. సెట్‌లో అందరికీ పంచిపెట్టడం. కురచేత్తో (ఎడమచేత్తో) పేకాడుతూ, షాట్ గ్యాప్‌లోనూ, లంచ్ బ్రేక్‌లోనూ యూనిట్ మొత్తాన్ని సందడిగా ఉంచటం తన అలవాటు. అటువంటిది ఎలా తెచ్చిన కేరియర్లు అలా తిరిగి వెళ్లిపోతుండేవి. మనసంతా చేదుగా అయిపోయేది.
సావిత్రి డైలాగులు చెబుతున్నపుడు తన డైలాగులు మరచిపోవడం, ఒక్కోసారి సావిత్రి నటించినపుడు ఉక్కిరిబిక్కిరై ఏడ్చేస్తూ.. ఆ దుఃఖంనుండి తేరుకోలేకపోవడం జరిగేది. హెవీ సీన్సు చేస్తున్న సావిత్రి అవలీలగా చేసేస్తే.. చిన్న చిన్న డైలాగులు చెప్పవలసిన సూర్యాకాంతమ్మ దాట్లు వెయ్యడం అందరికీ ఆశ్చర్యంగా అనిపించేది. ఒకటి రెండు సందర్భాల్లో సినిమాలోనుంచి తప్పుకొనే ప్రయత్నం చేసింది కూడా. మధుసూధనరావు వారిస్తూ.. ‘‘ఇది కేవలం సినిమా- జీవితం కాదు. మీరు చేస్తున్నది నటన... నిజం కాదు. టేకిట్ ఈజీ!’’ అంటూ ఓదార్చేవారు. తాత్కాలికంగా సూర్యాకాంతమ్మ సమాధానపడేదిగాని, తన మనసులో తొలిచేస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయేది.
రక్తసంబంధం సినిమా పూర్తయ్యింది. ప్రివ్యూ చూశారంతా. చూసినవారంతా బరువైన గుండెతో బైటికివచ్చారు. సావిత్రమ్మనీ, యన్‌టీఆర్‌నీ అభినందించడానికి కూడా ప్రివ్కూ చూసినవారి నోట మాట రాలేదు.
మరుసటిరోజు ఉదయం సూర్యాకాంతమ్మ సావిత్రి ఇంటికి వెళ్ళి... తాను ఇష్టపడి కొనుక్కున్న బంగారు జరీ చీర బహుమతిగా ఇచ్చి ‘అమ్మా! నటీమణుల్లో నీముందూ నీవెనుక ఎంతమంది కథానాయికలున్నా- నీదే అగ్రస్థానం.. నీతో సరితూగగల నటన ప్రదర్శించగలవారు వస్తారని నేననుకోను!
నేనూ సహజంగానే నటిస్తాను.. కానీ నీ నటన.. అజరామరం!’ అంటూ దీవించి... ‘నీలో ఆ కళామతల్లికి పాదాభివందనం చేసుకోనివ్వమ్మా!’ అంటూ కిందకువంగిన సూర్యకాంతమ్మను అక్కున చేర్చుకొని పసిపిల్లలా భోరున ఏడ్చేసింది సావిత్రి!

-ఇమంది రామారావు 9010133844