Others

ప్రేమకు ‘వంద’నం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరుడి పేరు: జాన్ కుక్
వయస్సు: వంద సంవత్సరాలు
వధువు పేరు: ఫిలిస్
వయస్సు: 102 సంవత్సరాలు
వీరిద్దరి వివాహం ఇటీవల ఓహియోలో జరిగింది. సంవత్సరం క్రితం వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. వీరు నివసించే సహాయక జీవన కేంద్రంలో ఏడాదిగా సహజీవనం చేసి ఇప్పుడు వివా హం చేసుకుని మ్యారేజ్ సర్ట్ఫికెట్ అందుకున్నారు. జాన్ రెండవ ప్రపంచ యుద్ధ అనుభవజ్ఞుడు.. అతను ఇటీవల వంద సంవత్సరాలకు చేరుకున్నాడు. ఆగస్టు 8కి ఫిలిస్‌కి 102 సంవత్సరాలు నిండుతాయి. ఈ పెళ్లి గురించి ఫిలిస్ మాట్లాడుతూ ‘నిజం చెప్పాలంటే మేమిద్దరం ఒకరినొకరం గాఢంగా ప్రేమించుకున్నాం. ఈ వయసులో ప్రేమేంటి? అని అందరికీ అనిపించవచ్చు.. కానీ మాకు అలా అనిపించడం లేదు’ అంటూ నవ్వుతూ చెప్పింది. జాన్ తన వధువు చేతిని పట్టుకుని మీడియాతో.. ‘మా ఇద్దరికీ ఒకరంటే ఒకరికి అమితమైన ప్రేమ. పెళ్లికి మేము అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్నాం.. అందుకే వివాహం చేసుకున్నాం’ అని చెప్పాడు. ఇక వీరిని ఆశీర్వదించడానికి అక్కడ అందరూ చిన్నవారే.. అందుకని అందరూ నవ్వుతూ శుభాకాంక్షలు తెలిపి పక్కకు తప్పుకున్నారు.