Others

దేశం కోసం విద్యార్థి ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) క్రియాశీలక ప్రస్థానం ప్రా రంభమై ఈనెల 9వ తేదీ నాటికి 70 ఏళ్లు పూర్తవుతున్నాయి. ‘విద్యార్థి పరిషత్’ ఆలోచనాధార, సంఘటనాత్మకమైన కార్యపద్ధతికి పునాది వేసిన స్వర్గీయ యశ్వంతరావు కేల్కర్, స్వర్గీయ దత్తాజీ డిండోల్కర్‌ను ఈరోజు స్మరించుకోవాల్సిన దినం. వారి ఆలోచనలను, ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి యువత కంకణబద్ధులై నడుం బిగించాల్సిన రోజు. ఏబీవీపీ ఆలోచనాధార కోసం ప్రాణత్యాగం చేసిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాల కార్యకర్తలు ఈరోజు అందరికీ గుర్తుకువచ్చేరోజు.
స్వాతంత్య్రం పొందాక వేల సంవత్సరాల మన దేశ వైభవ సంపన్న పరంపరను దృష్టిలో పెట్టుకుని, వాటిని ఆధునిక, వికసిత పరిస్థితుల కారణంగా ఏర్పడిన దోషాల నుండి ముక్తిచేయాలనే స్వప్నాన్ని జాతి మొత్తం కంటోంది. ఇలాంటి పరిస్థితులలో కొంతమంది యువకులు ఈ కలను సాకారం చేసుకోవడానికి కార్యకలాపాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమాలను దేశవ్యాప్తంగా 9 జూలై 1949న ‘అఖిల భారతీయ విద్యార్థి పరిషత్’ పేరుతో ప్రారంభించారు. వ్యక్తి నిర్మాణం ద్వారా జాతీయ పునర్నిర్మాణమే ముఖ్య ఉద్దేశంగా విద్యార్థి పరిషత్ ప్రారంభమైంది. జాతీయ పునర్నిర్మాణం అంటే ఏమిటి? అభివృద్ధి చెందడంలో అందరికీ సమాన అవకాశాలు లభించాలని ఏబీవీపీ ఆశిస్తున్నది. అన్ని రంగాలలో సమన్యాయం జరిగినపుడే ఆ ఆకాంక్ష నెరవేరుతుంది.
ఈ దేశం అత్యంత ప్రాచీనమైనది. పూర్వీకుల అమూల్య జ్ఞాన సంపదను రక్షిస్తూ మనం ఆధునికంగా సంపన్నమవ్వాలి. సామాజిక దురాచారాల నుండి, చెడు పరంపరల నుండి సమాజాన్ని విముక్తి చేయాల్సిన అవసరాన్ని గుర్తించి తరాలు గుర్తించి సంకల్పం తీసుకోవాల్సిన సమయం ఇది. 1982లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని చాలా విశ్వవిద్యాలయాలలో నక్సల్స్ ప్రాబల్యం పెరిగిపోయింది. వారు పేదల అభ్యున్నతి పేరుతో విద్యార్థులను హింసాత్మక కార్యకలాపాల వైపు ప్రేరేపించేవారు. ఈ దేశ సంస్కృతిని కించపరుస్తూ విద్యార్థులలో దేశద్రోహభావాలను ప్రేరేపించి వారిని దేశానికి వ్యతిరేకంగా నిలబెట్టే పనులు చేసేవారు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేవారు. వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయాన్ని నక్సల్స్ కార్ల్‌మార్క్స్ విశ్వవిద్యాలయంగా పిలిచేవారు. ఇక్కడ ప్రతి సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం లేదా రిపబ్లిక్ డే సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడాన్ని వారు నిరోధించేవారు. ఆరోజున నల్లజెండాలు ఎగురవేసేవారు. విశ్వవిద్యాలయంలో ఇంత జరిగినా ఎవరూ దీనిని ప్రతిఘటించేవారు కాదు. భయం కారణంగా ప్రజలు సైతం వౌనంగా ఉండేవారు. 26 జనవరి 1986 నాడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగురవేయకుండా నక్సల్స్ సానుభూతిపరులు అడ్డుకున్నారు. పరిషత్ కార్యకర్తలు దీన్ని సహించలేకపోయారు. సామ జగన్‌మోహన్‌రెడ్డి అనే ‘పరిషత్’ కార్యకర్త, ఆయన సహచరులు సంఖ్యాబలం లేకపోయినా, తాము సాయుధులు కాకపోయినా, దృఢమైన సంకల్పబలంతో నక్సలైట్ల దురాగతాన్ని ఎదిరించారు. పదిహేను ఇరవై మంది పరిషత్ కార్యకర్తల అభ్యర్థన మేరకు కొంతమంది విశ్వవిద్యాలయ సిబ్బంది గణతంత్ర దినోత్సవం నాడు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
ఈ విషయం తెలిసి అక్కడకు వచ్చిన నక్సల్స్ దౌర్జన్యం చేసి అక్కడ ఉన్న వారిని తీవ్రంగా కొట్టి త్రివర్ణ పతాకాన్ని చింపివేసి, నల్లజెండాను ఎగరవేశారు. నక్సల్స్ బెదిరింపులకు లెక్క చేయక సామ జగన్మోహన్‌రెడ్డి తిరిగి జాతీయ పతాకాన్ని ఎగురవేశాడు. వారికి వ్యతిరేకంగా పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదుచేశాడు. ఈ విషయం న్యాయస్థానానికి వెళ్లి తీవ్రమైనదిగా రూపుదిద్దుకుంది. తమకు వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెప్పవద్దని నక్సలైట్లు జగన్మోహన్‌రెడ్డిని బెదిరించారు. కానీ అతడు పరిషత్ కార్యకర్త గనుక నిర్భయంగా బలిదానానికి సిద్ధమయ్యాడు. సాక్ష్యం చెప్పడానికి న్యాయస్థానానికి బయలుదేరిన అతడిని నడిరోడ్డుపై నక్సల్స్ హత్య చేశారు. గద్దర్ పాడే విప్లవ గీతాలలో ఉన్న అభ్యంతరకర అంశాలను ఎత్తిచూపినందుకు నాగార్జున కళాశాలకు చెందిన నల్గొండ వాసి ఏచూరి శ్రీనివాస్‌ను 1981 ఏప్రిల్‌లో నక్సల్స్ హత మార్చారు. ఈ విధంగా హత్యాకాండను, విధ్వంసాన్ని సృష్టించినట్లయితే పరిషత్ కార్యకర్తలు భయభ్రాంతులకు లోనై పారిపోతారని నక్సల్స్ భావించారు. కానీ వారి ఆలోచన తప్పని రుజువు చేశారు పరిషత్ కార్యకర్తలు. 45 మంది పరిషత్ కార్యకర్తలు నక్సల్స్ చేతుల్లో అమరులయ్యారు.
రెండు దశాబ్దాల ఈ సుదీర్ఘ సంఘర్షణ ఫలితంగా నక్సల్స్ కొనసాగిస్తున్న హింసాకాండకు వ్యతిరేకంగా విద్యార్థి లోకానికి కనువిప్పు కలిగింది. విద్యార్థులు అహింసా మార్గంలో పయనిస్తూ నక్సల్స్‌ను తిరస్కరించారు. ఫలితంగా ఈనాడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో నలువైపులా ‘‘్భరత్ మాతాకీ జై’’, ‘వందే మాతరం’ నినాదాలు మార్మోగుతున్నాయి. విద్యార్థుల సమస్యలపై నిరంతరం ఉద్యమాలు చేయడం, వారి సమస్యలను ప్రభుత్వం పరిష్కరించేంత వరకు ఏబీవీపీ ఉద్యమాలు చేసింది. ఈ 70 సంవత్సరాలలో అనేక ఉద్యమాలకు ఏబీవీపీ నాయకత్వం వహించింది. హాస్టళ్లలో సమస్యలు కావచ్చు, ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యలు కావచ్చు, ఎంసెట్ లీకేజీ కుంభకోణం కావచ్చు, ప్రభుత్వ విద్యారంగం పరిరక్షణ వంటి సమస్యలపై నిరంతరం ఉద్యమాలను చేస్తుంది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో ఏబీవీపీ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. 1998లో నెల్లూరులో జరిగిన ఏబీవీపీ రాష్ట్ర మహాసభలలో తెలంగాణ అభివృద్ధి సాధించాలంటే ప్రత్యేక రాష్ట్రంతోనే సాధ్యమని భావించి మూడు ప్రాంతాల నాయకులను ఒప్పించి ప్రత్యేక రాష్ట్ర తీర్మానాన్ని చేశారు. 2001లో చేపట్టిన తెలంగాణ సస్యశ్యామల యాత్ర అంటూ బాసర నుండి శ్రీశైలం వరకు బస్సు యాత్రను నిర్వహించి తెలంగాణ ఉద్యమానికి ఏబీవీపీ కార్యకర్తలు ఊపిరి పోశారు. 2009లో ప్రారంభమైన మలి దశ ఉద్యమంలో ‘నా రక్తం.. నా తెలంగాణ’ కార్యక్రమంలో ఇరవై వేల మంది విద్యార్థులు ఒకే రోజు రక్తదానం చేసి లిమ్కా బుక్ రికార్డును సాధించారు. తెలంగాణ రణభేరి బహిరంగ సభకు అప్పటి లోక్‌సభ ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్‌ను తీసుకువచ్చారు. విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకోవద్దని తెలంగాణ విద్యార్థులకు ఆమె పిలుపునిచ్చారు. తెలంగాణ హరితహారం, తెలంగాణ మహా పాదయాత్ర వంటి అనేక సామాజిక ఉద్యమాలలో పాల్గొనే విధంగా విద్యార్థులను ఏబీవీపీ ముందుకు నడిపింది. 70 సంవత్సరాల కాలంలో ఏబీవీపీ అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూ, విద్యార్థుల అండదండలతో, మేధావుల సలహాలతో ముందుకు పోతోంది. రాబోయే రోజుల్లో విద్యారంగం పరిరక్షణకు, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఏబీవీపీ అలుపెరగని పోరాటాన్ని చేస్తుంది.
*
(నేడు ఏబీవీపీ ఆవిర్భావ దినం)

-చింత ఎల్లస్వామి, తెలంగాణ ఏబీవీపీ సంయుక్త కార్యదర్శి