Others

సర్వనిధులకూ మూలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఋణానుబంధ రూపేణా పశుపత్ని సుతాలయాః
ఋణక్షయే క్షయం యాంతి కాత్రపరివేదనా’’
పశువులు, భార్య, పుత్రులు, ఇల్లు, ఆస్తులు- ఇవన్నీ కూడా మనిషి గత జన్మలో చేసుకున్నటువంటి సుకృతాలను (పాపపుణ్యాలను) బట్టి కలుగుతాయి. ఋణం తీరిపోగానే ఇవేవీ ఉండవు.
వేటి మార్గంలో అవి పోతాయి. బంధాలు, బంధుత్వాలు చెదిరిపోతాయి. మనిషి బ్రతికున్నంతవరకే ఈ ఆతృత, ఆరాటం, స్వార్థం ఉంటాయి. ఇవి గట్టిగా పట్టుకొని అస్సలు విడిచిపెట్టవు. ప్రేమ, వాత్సల్యంతో మొదలై నీది, నాది అనే స్వార్థం వ్యామోహంలా మారిపోతాయి. జీవితంలో ఏది జరిగినా అంతా ఋణానుబంధంగానే చెప్పుకోవాలి. ఈ జన్మలో పుణ్యం చేసినా, దానధర్మాలు చేసినా వాటి ఫలితం అంత తొందరగా అదే జన్మలో కనిపించదు.
మళ్లీ జన్మంటూ ఉంటే దాని ఫలితాలను అనుభవించవచ్చును. కానీ ఇపుడు పూజలు, వ్రతాలు, యజ్ఞాలు, యాగాదులు చేసినట్లయితే, దానధర్మాలను చేసినట్లయితే ఇపుడే ఆ ఫలితాలను అనుభవిస్తామనుకుంటే అది తెలిసీ తెలియక చేసేటటువంటి పొరపాట్లుగానే భావించవచ్చును. ఈ విషయాలను గమనించినట్లయితే ఎలాంటి ఎలాంటి బాధ, దుఃఖం ఉండవు. మనిషి అనుకున్నట్లు అన్నీ జరిగితే ఎన్ని మంచి పనులు జరిగేవో అంతకంటే ఎక్కువ చెడు, కీడు కూడా జరిగి ఉండేది. వాస్తవలు, ఆధ్యాత్మిక విషయాలు, చరిత్ర తెలియక మనుష్యులు అపోహలతో, ఊహలతో కాలం గడిపేస్తుంటారు. తెలియకపోవడంతప్పుకాదు, ప్రయత్నం చేయకపోవడం పొరపాటు అవుతుంది. ఆస్తులు పోయేటప్పుడు కానీ, అయినవారు దూరం అయ్యేటటువంటి సమయం ఆసన్నమైతే వాటిని ఎవ్వరూ ఆపినా ఆగవు. దూరం కావాల్సిందే మరి. ఆస్తులుపోవటమంటే ఎవరో తీసుకోవడం కావచ్చు, వ్యాపారాల్లో నష్టం రావచ్చు. అపుడు ఆస్తులు పోయి వీధిన పడే అవకాశాలుంటాయి.
ఒక్కోసారి జీవితంపై విరక్తి చెంది, వైరాగ్యంతో కానీ వాటిని మనిషే వదిలేసుకుంటాడు. ఇంకా బంధాలు, బంధుత్వాలకు దూరం కావడమంటే భార్యా పిల్లలను పోగొట్టుకోవడం, తానే వారికి లేకుండా పోవడం లేదా భగవంతుని ధ్యానంలో ఉండిపోవడం. వీటిల్లో ఏది జరిగినా కూడా బంధాలు, బంధుత్వాలు కోల్పోయినట్లే. వీటన్నింటికీ కూడా ఏదో ఒక అనుబంధం అదే ఋణానుబంధం ఉండటంవల్లే కొంతకాలం ఒక దగ్గరగా ఉంటాయి. ఆ ఋణం తీరిపోయేటటువంటి కాలం వచ్చిందంటే ఎంత నిలుపుకోవాలనుకున్నా కూడా నిలవదు.
పూర్వజన్మ సుకృతంవల్ల పశువులు, పాడితో ఇల్లంతా కళకళలాడుతూ ఉంటుంది. ఆ ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవి తాండవిస్తుంది. కర్మ ఫలితాన్ని బట్టి కొన్ని తరాలు కూడా అష్టైశ్వర్యాలతో ఉంటుంది ఆ కుటుంబం. పేరు ప్రఖ్యాతులు కూడా గొప్పగా ఉంటాయి. కాలగర్భంలో అన్నీ పోతాయి. గుణవతి అయిన భార్య, తెలివితేటలు, తేజస్సు కల్గిన కుమారులు ఉన్నప్పటికీ కాలంతో వచ్చే మార్పుల్లో, విచక్షణ లేకుండా పోయే అవకాశముంటుంది. పుత్రుడు పుట్టగానే సంతోషంతో ఉప్పొంగిపోయిన తండ్రి శని ఆవహిస్తుండడంతో అతని కళ్ళముందే కొడుకు పతనాన్ని కూడా చూడాల్సిన పరిస్థితులు కల్గుతాయంటే ఎంతమాత్రం అతిశయోక్తికాదు. కాబట్టి మనిషి కనీసం ఈ జన్మలోనైనా పుణ్యం, దానం, ధర్మాలు చేస్తే కనీసం మరు జన్మలోనైనా మనిషి జన్మ ఉంటే గనుక ఆ పుణ్యాలకు ఫలితాలను అనుభవించవచ్చు.
ఈ లోకంలో కనిపించే ఆస్తులైనా, అనుబంధాలైనా ఒకనాటికి నశించిపోయేవే. ఎంత పుణ్యం మూటకట్టుకున్నా కూడా అది కూడా ఒకనాటికి నశించేదే. ఎప్పటికీ నిలిచిఉండేది శాశ్వతమైన బంధం మాత్రం భగవంతునితో అనుసంధానమే. పుణ్యంకానీ, పాపం కానీ ఆశించకుండా కేవలం అంతా ఈశ్వరార్పణం చేయగలిగితే ఆ జీవునకు పరమాత్మకు భేధం ఉండదు. ఆ బంధమే శాశ్వతంగా ఉంటుంది.
మహర్షులంతా ప్రజలంతా ధర్మమార్గంలో నిలవాలని సత్యాన్ని ధారణ చేయమని ఉద్బోధించడంలోని రహస్యమదే. స్వార్థాన్ని విడిచిపెట్టాలి. భగవంతునికి ఇష్టానిష్టాలు లేవు. కాని భగవంతుని ప్రేరణ ఇది అనుకొని పనులు చేస్తే పుణ్యం కాని పాపం కానీ అంటవు. సంగతులన్నింటినీ వదిలివేసి పరంధాముని సన్నిధినే చాలు అనుకొంటే నిత్యమూ సత్యమూ అయన పరంధాముని లాగే మనమూ ఉండవచ్చు. జీవునకు పర మాత్మకు భేదం లేకుండా పోతుంది. సర్వ సృష్టికీ కర్త కర్మక్రియ అయన ఆ పరమే శ్వరునితో పాటు ఉండవచ్చు. ఆ పరమాత్మ సన్నిధియే అన్ని నిధులకూ మూలకారణం.

-శ్రీనివాస్ పర్వతాల 9014916532