Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎంత విచిత్రం?... నిజానికి ప్రతిమనిషీ ఒక యజ్ఞపురుషుడే!...అతనిలోనూ ఒక నిరంతర యజ్ఞ ప్రక్రియ!... అది ఆగితే ప్రాణం ఆగినట్లే!... ప్రాణం ఆగిపోతే సృష్టి స్తంభించినట్లే!... నిజానికి చలనమే జగత్తు!... విశ్వమే ఒక మహాయజ్ఞశాల!...జీవితమే ఒక యజ్ఞం!... ఎంత చిత్రాతిచిత్రం!...
ఇంతలో ఒక తార రాలిపోయింది ఒక గగన కుసుమంలా!... మళ్ళీ నిశితంగా పైకి చూశాడు.
ఈసారి అతని దృష్టి సప్తర్షి మండలంపై కేంద్రీకృతమైంది. ఆ నక్షత్రాల పేర్లు ఏమై ఉంటాయి!... వశిష్ఠ, ఆత్రి, గౌతమ, కశ్యప, భరద్వాజ, జమదగ్ని, విశ్వామిత్ర నక్షత్రాలేనేమో!... ఈ విశ్వామిత్ర మహర్షి వెనుక తానూ తన సోదరుడూ, తన వెనుక ఒక చక్రవర్తీ, ఆయన వెనక రాజులూ, సామంతులూ, వారి వెనక సమస్త సామ్రాజ్యమూ ఉన్నట్లుగా ఈ నక్షత్రాల వెనుక ఎన్ని నక్షత్రాలో?... ఎందరు సూర్యచంద్రులో?... అంతా బీరకాయపీచే సుమా!...
ఈ సప్తర్షి మండలంలో విశ్వామిత్ర నక్షత్రం ఏదో?...ఈ నక్షత్ర మణిహారంలో మధ్యగానున్న నక్షత్రమేనేమో!...
రాముని దృష్టి ఆ విశ్వామిత్ర నక్షత్రంపై నిలిచింది. దాని ముందు నక్షత్రాల కుప్పలు! ఆ విశ్వామిత్ర నక్షత్రమూ ఒక యాగం చేస్తోంది!... ఆ అగ్నిజ్వాలలు ఆకసాన్నంటుతున్నాయి!... ఆ కాంతులు దశదిశల్లో విస్తరిస్తున్నాయి!... వేద మంత్రఘోష విశ్వవ్యాప్తవౌతోంది!...
ఇంతలో, ఒక రాక్షస సైన్యంలా, ఒక మహాసాగర కెరటాల్లా గుంపులు గుంపులుగా వచ్చేశాయి కాలమేఘాలు!...్భకరంగా గర్జిస్తున్నాయి!

ఇంకావుంది...