Others

నైషధమ్ (హంస దౌత్యం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దమయంతీ! శాంతి, దాంత్యాది గుణసంయమనములకు విశ్రాంతి ధామమైన (విశ్రమించునట్టి ఇల్లు గృహము) ఈ ‘‘అవంతి’’ పతియందు (ఈ మాళవ దేశపతి యందు- ఉజ్జయిని రాజధాని) నీ అంతరంగమందు అనురాగము మొలచెనేని- ఈ ఉజ్జయిని వద్దనున్న ‘‘శిప్ర’’అనే నదియందు జలవిహారము ఒనరించుటకు వీలగును. ‘‘మహాకాళము’’ఉజ్జయిని యందలి శివక్షేత్రము. ఇందలి వృషభ ధ్వజుడైన పరమశివుని భుజింపుము ఇది ఒక పుణ్య అవకాశము. విశాలమైన ఈ నగర సింహాసనమును అధిరోహించు సదవకాశము తప్పక సంభవించును’’ అని పలుక
ఆ మాటలు విన్న దమయంతి తూష్ణ్భీవంబున వౌనముదాల్చి ఆ ఉజ్జయిని విభుని మీద కటాక్ష వీక్షణంబును చూపలేదు. అంత ఆ విరించిరాణి దమయంతి వ్యతిరేకతను గుర్తించి ముందుకు సాగి
గౌడరాజు
‘‘ఓ సిగ్గరీ! ఈతడు ‘గౌడదేశపురాజు’ వీనిని చూడుము. మనోజ్ఞమైన రతిక్రీడా రహస్య కోవిదుడు. పండిత శ్రేష్ఠుడు. ఓ పంకజనేత్రా! ఇతని కీర్తిచేత చంద్రుని కిరణములు తృణీకృత ములయినందు (గడ్డిపోచలుగా చేయబడినందున) ఆ తృణమును (గడ్డిని) మేయుటకు జింక చంద్రుని చేరినది. కుపలయ శ్యామవర్ణముగల (నల్లని కలువ వలె నల్లనివాడు) ఈతని బాహువుల యందు బిగుయునట్లుగా చేరుము’’అని అన్నది.
దమయంతి అతని ఎడల ఆశ లేనట్టుగా చూడగా అది గ్రహించిన వాగ్దేవి ముందుకు కదలి
మథురాధిపతి
‘‘తెలుసా! ఇదిగో ఇటు చూడుము! ఈతడు మథురాధిపతి. (మథుర శూరసేన దేశానికి రాజధాని) శూరసేన దేశమునకు రాజు. ఇంద్రునంత భోగముగలవాడై, ప్రజలు స్వర్గవాసులంత సుఖులుగా ఉండునట్లు స్వర్గవైభవముగలదైన మథురాపురమును ఏలుచున్నాడు. మీసముగడ్డము లేని ఇతని వదన కమలమునకు కడుపుమీద మచ్చగలవాడైన (నడుమ మచ్చగల) చంద్రుడు సాటి రానేరడు. ఓ అలికులవేణీ! (తుమ్మెదల గుంపువంటి జడ గలదానా)
ఈ మథురకడ యమునానదిలోని మడుగులో చేరి గ్రీష్మదినములలో (వేసవి పగళ్ళయందు) ఇతనితో జలక్రీడలను సలుపుదువుగాక! గోవర్థన పర్వతముయొక్క చోటియలయందు వర్షాసమయములందు అడవి నెమళ్ళు చేయు నృత్య సౌష్ఠవమును వీక్షించవచ్చును. ఎక్కువగా అలసినచో చల్లగాలి కావలెననెడి కోరిక ఎక్కువగానుండును. అట్టి సమయమున సుగంధముతోకూడి పరిమళము వెదజల్లుమారుతము వచ్చి సేదదీర్చు ఆ భోగము చెప్పనలవిగాదు! అట్టి అనుభూతిని, భోగమును బృందావనములో బృందావన మారుతముచేత కలుగును. అందులకై ఈ మథురాధిపతిని వరించుము’’ అని అనగా
దమయంతి తన ఱెప్పల చివరలను వ్రాల్చినది. కనులను మూసుకొనుటవలన ఇష్టములేదనే సంకేతాన్ని ఇచ్చింది. అంత ఆ వాగ్భామ (వాణీరమణి) దమయంతిని తోడ్కొని ముందుకుసాగి ముక్తి క్షేత్రమగు ‘వారణాసి’కి రాజగు ‘కాళీరాజును చూపి
కాశీరాజు
‘‘ఓ వరాటదేశ రాజపుత్రీ! ఈతడు ‘కాళీరాజు’’. ఇతడి రాజధాని ముక్తిక్షేత్రమైన ‘‘వారణాశి’’ ఇతని కులదైవము అఖిల భువనస్థుండగు ధూర్జటి (పరమశివుడు) ఇతని విహార ప్రదేశము ముల్లోకముల శోచమును ఆర్పునదైన వేల్పుటేరు. (గంగానది). అన్నప్రదాన గృహము ‘‘కాశీ విశాలాక్షీ కేళీ భవనము’. (పార్వతీదేవియొక్క క్రీడాగృహము- విశాలాక్షి= గరిట చేతబట్టుకొని అందరికీ అన్నమును వడ్డించునది) భుజాశక్తి శత్రురాజుల యువిదల ( భార్యల) కన్నీరనెడు వర్షపుధారలచేత వర్థిల్లునట్టిది. అందువలన ఇట్టివానిని వివాహమాడుట తగును. ఈతని వరించుడు’’ అని అనగా

- ఇంకా ఉంది