Others

పరమేశ్వర శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫణుల హారాలు కంఠాన ఫాలభాగ
మందు బూదియునొడలెల్లఁ జందనముగఁ
బూసికొను నిరాడంబర మూర్తివీవు
పాహిమాం పరమేశ్వరా! పార్వతీశ!

భావం: శంకరా! మెడలో పాములనే రత్నహారాలుగా ధరించితివి. ఫాలభాగమందే కాక శరీరమంతా బూడిద నే చందనముగా పూసుకొన్నావు. నిరాడంబర మూర్తివయ్య నీవు.

కాశి కేగకఁబోతినే కాలకంఠ
అరుణగిరి చుట్టుఁ దిరగలేదయ్య నన్నుఁ
గావమనిఁ గోరెడర్హత ఁగాంచలేదు
పాహిమాం పరమేశ్వరా! పార్వతీశ !

భావం: ఓ నీలకంఠ స్వామీ! కాశీ క్షేత్రానికి వెళ్లలేకపోయాను. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేయలేకపోయాను. కాపాడమని కోరే అర్హత కూడా నాకు లేదు. అయినా నిన్ను కాపాడవలసినదిగా కోరుకుంటున్నాను శంకరా!

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262