Others

నాకు నచ్చిన పాట--నరుడా.. ఓ నరుడా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నరుడా ఓ నరుడా.. ఏమి కోరిక?’ అంటూ భైరవద్వీపం చిత్రంలో సాగే గీతం నాకు చాలా ఇష్టమైన పాట. ఎన్టీఆర్ ‘పాతాలభైరవి’ తర్వాత అందులోని కొన్ని పోకడలున్న చిత్రంగా ‘్భరవద్వీపం’ తోస్తుంది. ఈ చిత్రం విడుదలైనపుడు జానపద ప్రియులు అందుకే పరుగులు తీశారు. బాలకృష్ణ తన నటనా చాతుర్యంతో ప్రేక్షకుడిని మెప్పించడంలో సఫలమయ్యాడు. ఇక -పాతాళభైరవి టైటిల్ రోల్ పోషించిన గిరిజకు ఆ చిత్రంలో ఒకే ఒక డైలాగ్ ఉంటుంది ‘నరుడా ఏమి నీ కోరిక’ అని. ఆ చిత్రంలో ఆమెకు మరో డైలాగ్ లేదు. పాతళభైరవిలో పాపులరైన ఈ డైలాగ్ మొదటి వాక్యంగా గీతాన్ని అల్లుకుంటే బావుంటుందన్న మాధవపెద్ది సురేష్ సూచనపై, వేటూరి కొన్ని గంటల వ్యవధిలోనే పాట రచన పూర్తి చేశార్ట. ఈ పాటను సింధుభైరవి రాగంలో రమణీయంగాను, కవ్వింపు ధోరణితో బాణీని కట్టారు మాధవపెద్ది. రెండో పంక్తిలో -‘కోరుకో, కోరి చేరుకో, చేరి ఏలుకో బాలకా’ అన్న పదాలతో గీతానికి మంచి ఊపు తెచ్చారు వేటూరి. చిత్రంలో బాలకృష్ణ, రంభలపై నృత్య సన్నివేశంగా చిత్రీకరించడం మరింత ఆకట్టుకుంది. యువరాజుగా బాలకృష్ణ యవ్వనానికి ముగ్దురాలైన రంభ ఆ తమకంలో ఉన్న సమయంలో, ఆమెవద్దనున్న తాళం చెవిని కొందరు మరగుజ్జులు కొట్టేసే సన్నివేశంతో పాటను చిత్రీకరించడం సూపర్బ్. 1994లో విడుదలైన ఈ భారీ జానపద చిత్రంలో ఈ పాట -ఆ ఏడాది విడుదలైన మోస్ట్ పాపులర్ సాంగ్‌గా బిబిసి నుంచి గుర్తింపు పొందడం విశేషం. మధుర గాయని జానకి పాటను జనాకర్షణగా గానం చేసి నంది అవార్డును సొంతం చేసుకున్నారు. అప్పట్లో ‘్భరవద్వీపం’ షూటింగ్ ఈ పాటతో ప్రారంభం కావడం, నటసార్వభౌమ ఎన్టీఆర్ కెమెరా స్విచ్చాన్ చేయడం ప్రత్యేకతలు. వేటూరి, మాధవపెద్ది కాంబినేషన్లో ప్రేక్షకాదరణ పొందిన ఈ పాటను ఆనందించని వారు ఉండరు.
***

వెనె్నల రచయితలకు
సూచన
వెనె్నలకు రచనలు
పంపాలనుకునే వారు
ఈ కింది విషయాలను గమనించగలరు
ప ప్రతి మంగళవారం వెలువడే వెనె్నలకు రచనలు శుక్రవారంలోపు చేరాల్సి వుంటుంది.
ప రచనల్లో కొత్తదనం ముఖ్యం
ప అరిగిపోయిన పాత సినిమా కబుర్లు, శ్రద్ధాంజలి వ్యాసాలు, సినిమాలపై హితబోధల కన్నా, చదివించే కొత్త తరహా వ్యాసాలకు ప్రాధాన్యత వుంటుంది.
ప కొత్త సినిమాలపై సమీక్షలు రాయాలనుకున్న ఔత్సాహికులు ముందుగా ఒకటి రెండు సమీక్షలు పరిశీలన కోసం రాసి పంపితే, పరిశీలించగలం.
ప తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వచ్చే కొత్తసినిమాలను పరిశీలించే ఆసక్తి వున్నవారు, సంబంధిత వ్యాసాలు పంపితే అవీ ప్రచురణార్హమే.
ప కొత్త హాలీవుడ్ సినిమాలకు సంబంధించిన వ్యాసాలకు కూడా స్వాగతం.
ప ఇంతవరకు ఎక్కడా ప్రచురితం కాని, అపురూప చిత్రాలువుంటే పంపొచ్చు.
ప రచనలను ఈ మెయిల్‌లో స్కాన్ లేదా పిడిఎఫ్ ఫార్మాట్‌లో vennela@deccanmail.comకు మెయల్ చేయగలరు.
ప ప్రచురించిన (మీ వ్యూస్ మినహా) ప్రతి వ్యాసానికి పారితోషికం వుంటుంది.

మా చిరునామా :
ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్ , సికిందరాబాద్- 03

-కె సుబ్రహ్మణ్యం