Others

ప్రేమనగర్ (నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సురేష్ సంస్థని దశాబ్దాలుగా నిలదొక్కుకునేలా చేసిన చిత్రమిది. సురేష్ సంస్థ అధినేత రామానాయుడు కలలని సాకారం చేసిన చిత్రం. ఈ చిత్రానికి కథ కోడూరి కౌసల్యాదేవి నవల ఆధారమైతే, మనసుకవి ఆచార్య ఆత్రేయ సంభాషణలు, పాటలు కథాకథనంలో పటుత్వాన్ని కల్గించాయి అనడం ఎంతమాత్రం అతిశయం కాదు. ఈ చిత్ర సారధ్యాన్ని దర్శకుడు రాఘవేంద్రరావు తండ్రి కెఎస్ ప్రకాశరావు నిర్వహించారు.
తెరమీద పరిచయానికి వస్తే జగమెరిగిన, జనమెరిగిన రొమాంటిక్ హీరో అక్కినేని నాగేశ్వరరావు, నట శిరోమణి నవలానాయకి వాణిశ్రీ.. ప్రముఖ తారాగణం. ఆత్రేయ పదునైన సరస సరళ సంభాషణలు ఒకవైపు; మధురభావాల సుమమాలలైన గీత పరిమళాలు మరొకవైపు.. కెవి మహదేవన్ స్వర ఝరిలో అశేష ఆంధ్ర, ఆంధ్రేతర సినీ ప్రభంజనానికి ఊపుని, ఉత్తేజాన్ని అందించాయి. అత్యధిక సెంటర్లలో శతాధిక చిత్ర వసంతోత్సవాలని జరుపుకున్నాయి. త్రిభాషాచిత్రంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం తమిళ, హిందీ భాషల్లో కూడా నిర్మింపబడ్డది- ఆర్థికంగా అఖండ విజయాల్ని కట్టబెట్టింది సంస్థకి, నిర్మాతకి.
కారణం అన్నిశాఖలూ కలిసి సమన్వయ కృషిని జోడించడం, సినీ ప్రేక్షక లోకానికి అత్యంత చేరువకావడమని వేరేగా చెప్పవలసిన పనిలేదు.
ఇందులోని తారాగణం కథానాయకుడు అక్కినేని నాగేశ్వరరావు, కథానాయకి వాణిశ్రీ కాగా అగ్ర నటులు పద్మశ్రీ వి.నాగయ్య, నవరస నట సామ్రాట్ ఎస్.వి.రంగారావు, పుష్పలత మొదలైనవారు అతిథి పాత్రలో గంభీర ముద్రలువేశారు. ఇక సినీ ఆద్యంతం కనిపించే పాత్రలుగా శ్రీమతి శాంతకుమారి, హేమలత, గుమ్మడి, పెరుమాళ్ళు, కాకరాల, మీనాకుమారి, కె.వి.చలం, మరియు రమాప్రభ, రాజబాబు వినోదాన్ని అందిస్తారు.
సారవంతమైన భూమిపై మొలకలెత్తిన సస్యశ్యామలమైన పచ్చని పైరులా పరుగులెత్తిన సినీ గీతాలు తేట తేట తెలుగులా, మనసు గతి ఇంతే, ఎవరో రావాలి, ఎవరికోసం, నీకోసం వెలిసింది, కడవెత్తుకొచ్చింది, లేలేలే నా రాజా లాంటి విషాద, వేదాంత, శృంగార, జానపద గీతాలు అన్నిరకాల సినీ ప్రేక్షకులను అలరించగా ఘంటసాల, సుశీలమ్మల స్వగళంలో (సోలో) యుగళంలో పొంగాయి రస గంగ తరించాయి-
అందుకే ఈ చిత్రం నాకే కాదు అందరికి ఇష్టం అనడంలో ఏమాత్రం ఉత్ప్రేక్ష లేదు.

-ఆచార్య క్రిష్ణోదయ 74168 88505