Others

నైషధమ్ (హంస దౌత్యం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తన స్వయంవర మహోత్సవమునకు వచ్చిన పెక్కు రాజులను చూచుటయందలి నేడు కచేత పరాకు వహించి యుండెను. అందువలన ఆ కాశీరాజునకు భేదము గలిగించినది. అంత సరస్వతీదేవి దమయంతిని వేరొక్క నరదేవోత్తముని చూపి ఇట్లన్నది.
అయోధ్యాపతి
ఓ ఆకర్ణచారునయనా! దమయంతీ! ఇతడు అయోధ్య పురీశ్వరుడైన ‘ఋతుపర్ణ మహారాజు’. గొప్ప కీర్తిగలవాడు. కొనియాడదగినవాడు. ఈతని వరింపుము. తాత భగీరథుడు ఉత్తమ గంగను పారించగా, ఈతడు కీర్తిగంగను పారించెను. ఇతని కీర్తి సమగ్రముగా ఎవరూ వర్ణింపనేరరు. ఇతని గుణములు వ్రాయుటకు ఆపాటిరుూపాటి పలకలు చాలవు. అరివీర భయంకరుడు. ఇంతటి వానిని నీవు అవశ్యము పెండ్లాడ దగును’’ అని వాగ్దేవి పలుకగా ఆ రాజకుమారి మనువంశాగ్రణి అయిన ఋతుపర్ణుని గడచి అంగీకారమును తెలుపనైనది. అంత వాగ్దేవి.
పాండ్య భూపాలుడు
పద్మనయనా! దమయంతీ! ఈతడు పాండ్య భూపాలుడు. వీక్షింపుము. ఇతని గొప్పదనమును వర్ణింపనలవిగాదు. ఎట్టిదనిన దాడికి ఓడిన వైరిరాజులు తమతమ రాజధానులను పాడుపెట్టుకొని అడవుల పాలైరి. సంవత్సరమునకు ఒక అడవి చొప్పున ఒక అడవినైన వదలకు అడవులలో నివసించుచూ ఆ వరుసలో కొన్ని సంవత్సరములు ఏదో అంతకుముందు తాము చూడని అడవి ఆనుకొని అడివి బలసిన తమ రాజధానికేవత్తురు. ప్రపంచము చుట్టుకొని ఉన్న చక్రవాక పర్వతమువరకు ఇతని దానాది యశస్సు విస్తరించియున్నది. ఇతని ధనఃప్రాభావమును సముద్రపు ఆవల గట్టున ఉండువారు కూడా పొగడుచున్నారు. ఈ పాండ్యుని దంతి బలములు (గజ బలము) యుద్ధరంగమునందు చెలరేగుట, పూర్వము పృథుచక్రవర్తి పుడమినేలుచుండగా కొండలు రేగి ఎగురుచూ నేలనాక్రమించుట ఎట్లుండెనో అట్లుండినది. ఈతడు విష్ణుస్వరూపుడు. ఈతని వరించి సుఖముండును’’అని వాణి పలుకగా
దమయంతి ఎట్టి ఆసక్తినీ కనబరచకపోయెను. దమయంతి తన హృదయమున ప్రకాశించుటకు పాండురాజు తన రూపురేఖావిలాసముల ప్రదర్శించియూ ఈప్సితసిద్ధిని బడయక చింతిల్లెనాడు. తదనంతరము ఆ వాగ్దేవి దమయంతితో ముందుకు కదలి మహేంద్రగిరి ఏలుచున్న రాజును చూసి
కాళింగుడు
ఓ దమయంతీ! ఈతడు మహేంద్రగిరినాథుడు. మహేంద్రగిరికి దొర అయినవాడు. ఈతని వరింపుము. ఇతడు రూప సంపదయందు నీకు సమానుడు. నీకు తగిన రూపరి. (మహేంద్రము గజప్రభవమని ప్రసిద్ధి. ఆ కారణముచేత కళింగ దేశమునేలు రాజులను గజపతులు అని అంటారు) ఈతని వైరులు గజపతి వచ్చెనను భయముచేత (గజపతి బిరుదాంకితుడైన రాజు) అడవి ప్రదేశములకు పలాయతులైరి. ఈతడంతటి వీరుడు. ప్రసిద్ధమైన కీర్తిసముద్రమును సృజించినాడు ఈతని వరింపవచ్చును’’.
అని అనగా ఆ అబ్జయతాక్షి దమయంతి వలదన్నట్లుగా నవ్వగా, ఆ విరించిరాణి ముందుకుసాగి అచ్చట వేరొక రాజును చూపి
నేపాళరాజు
ఓ దమయంతీ! ఈతడు నేపాళ భూపాలుడు. ఈతని వరింపుము. గొప్ప ప్రతాపవంతుడు. ఓ పద్మలోచనా! ఈతని కీర్తి ప్రపంచమల్లా వ్యాపించియున్నది. అత్యాశ్చర్యకరమైన నేర్పుచేత ఈతడు వదులు బాణసమూహము శత్రురాజుల రొమ్ము ప్రదేశములను చుట్టును. ఈ రాజు పదములకు వైరివీరులు శరణాగతులై నమస్కరింతురు... వేయి మాటలవలన ప్రయోజనమేమి? వీని శత్రువులు యుద్ధముచేయనొల్లక పలాయనమగుట ఒకటియే బ్రతుకునుపాయమని తలంచెదరు’’అని ఈ విధముగా ఒత్తిచెప్పగా వినిన దమయంతి ...

- ఇంకా ఉంది