Others

నాకు నచ్చిన చిత్రం-- బాలభారతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1972లో వీనజ్ మహిజా ఫిలింస్ బ్యానర్‌పై పౌరాణిక బ్రహ్మ కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో ప్రకాశరావు నిర్మించిన చిత్రం ‘బాల భారతం’. భారతంలో పాండవులు, కౌరవులు, శ్రీకృష్ణుని బాల్యాన్ని చూపే సన్నివేశాలతో రంగుల్లో నిర్మించిన సంగీత భరిత చిత్రమిది. పాండు రాజు తన ఇద్దరి భార్యలతో అడవులకెళ్లడం, వరప్రసాదంతో కుంతీదేవి పాండవులను పుత్రులుగా పొందడం, విరహం భరించలేక భార్య మాద్రితో కూడి పాండురాజు శాపగ్రస్తుడై మరణించడం, పాండవులు జన్మించారన్న విషయం తెలుసుకుని అసూయతో గాంధారి గర్భాన్ని విచ్ఛిన్నం చేసుకుంటే, వ్యాసుడు దాన్ని సంరక్షించడంతో శత సోదరులుగా కౌరవులు ఉద్భవించటం, శ్రీకృష్ణ బలరామ జన్మములాంటి సన్నివేశాలు నారదుని పాటలో చూపడం ఎంతో బావుంటుంది. శకుని సహకారంతో కౌరవులు భీముడికి విషాహారం తినిపించి నీటిలో పడేయగా, భీముడు నాగరాజును మెప్పించి నాగాయుధబల సంపన్నుడిగా మారడం అద్భుత సన్నివేశం. కుంతిని పిలవకుండానే వ్రతం చేసుకున్న గాంధారి, కౌరవులు చేసిన మట్టి ఏనుగుపై గర్వంగా ఊరేగితే, ఆగ్రహించిన భీముడు నారదుడి సలహాతో ఇంద్రలోకం నుంచి ఐరావతాన్ని తెచ్చేందుకు ఉద్యుక్తుడవడం, అందుకు వీలుగా అర్జునుడు బాణాలతో ఇంద్రలోకానికి మెట్లుకట్టడం లాంటి సన్నివేశాలు అబ్బురపరుస్తాయి. కౌరవ, పాండవులు బాల్యంనుంచే కలహంపడిన ఘటనలు బాగా చూపించారు. భీష్ముడిగా ఎస్వీఆర్, పాండురాజుగా కాంతారావు, శకునిగా ధూళిపాళ, నారదుడిగా హరనాధ్, కుంతిగా అంజలి, మాద్రిగా చంద్రకళ, గాంధారిగా ఎస్.వరలక్ష్మి కనిపిస్తారు. బాలతారలుగా శ్రీదేవి, రాజ్‌కుమార్, విశే్వశ్వరరావు తదితరులు తమ పాత్రలను అవధులు దాటి నటించి రక్తికట్టించారు. చిత్రానికి సాలూరు రాజేశ్వరరావు అందించిన బాణీలు (నారాయణ నీ లీల, మానవుడే మహనీయుడు, ఆడేనోయి నాగకన్యక, భలె భలె పెదబావ వంటి గీతాలు) నేటికీ అలరిస్తున్నాయి. అటు పెద్దలను, ఇటు బాలలను అలరించేలా తీర్చిదిద్దిన రంగుల చిత్రం బాలభారతం.

-ఎస్‌ఎస్ శాస్ర్తీ, విశాఖపట్నం