వినమరుగైన

పరమేశ్వర శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గంగ తలపైనఁ గూర్చునె గౌరి యర్థ
భాగమై విలసిల్లెనే నాగభూష
ణా! నిరతము నీపాదాల నానుచుంటి
పాహిమాం పరమేశ్వరా! పార్వతీశ!

భావం: ఓ నాగాభరణా! శంకరా! ఆ గంగమ్మ తల్లి నీ తలపైకెక్కి కూర్చుంది. గౌరీమాత నీలో సగమై ప్రకావిస్తోంది. నేను మాత్రం నిత్యం నీ పాదాలను తాకుతున్నాను స్వామీ.నన్ను నీవే కాపాడాలి పార్వతీపరమేశ్వరా!
ఆ సరస్వతి చదువుల నరయనిచ్చు
లక్ష్మిమ సంపదలొలికించు లక్షణముగ
సకల సౌభాగ్యములనిచ్చు శంభుమూర్తి
పాహిమాం పరమేశ్వరా! పార్వతీశ!

భావం: పరమేశ్వరా ఆ సరస్వతీదేవి చదువులనిస్తుంది. ఆ లక్ష్మీదేవి లక్షణంగా సంపదలనిస్తుంది. శంభుమూర్తివైన నీవు మాత్రం సకల సౌభాగ్యాలను ప్రసాదిస్తావు స్వామీ. నన్ను కాపాడే దైవానివి నీవే పార్వతీ పరమేశ్వరా!

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262