Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్లో: ‘‘కౌసల్యా సుప్రజారామా! పూర్వా సంధ్యా ప్రవర్తతే
ఉత్తిష్ఠ నరశార్దూల! కర్తవ్యం దైవమాహ్నికమ్!’’
దిగ్గున లేచి కూర్చున్నాడు తాను. సూర్యునికన్న ముందుండే సూర్యప్రభలా, తనకన్నా ముందరే సోదరుడు లక్ష్మణుడు లేచి నుంచున్నాడు. ఇరువురూ మహర్షికి ప్రక్కప్రక్కనే నిలచి, అభివాదం చేస్తున్నారు.
***
విశ్వ సంరక్షణా యజ్ఞం
వచనం: ఐదు రోజుల దాకా నిర్విఘ్నంగా కొనసాగింది విశ్వామిత్ర మహాయజ్ఞం. రామలక్ష్మణులు ధనుర్ధారులై కాపలాకాశారు.
ఆరవ రోజున యజ్ఞ సమాపనం. వారు మరింత జాగ్రత్తగా ఉన్నారు.
ఆరవ రోజున కాలమేఘాల్లా మారీచ సుబాహువులేతెంచారు. తమ తమ అనుచరగణాలతో యజ్ఞకుండాన్ని చేరుకున్నారు. ఋషులు యజ్ఞంలో ఆజ్యంపోస్తే, వారు కలహాలకు ఆజ్యంపోశారు కుండలతో రుధిరాన్ని క్రుమ్మరిస్తూ!
అప్పుడు ఆ శ్రీరాముడు మానవాస్త్రాన్ని ఎక్కుపెట్టి, మారీచునిపై ప్రయోగించాడు. వాడు ‘హాహా’కారాల్ని చేస్తూ శతయోజనాల దూరానికి విసరబడి, సముద్రగర్భంలో పడిపోయాడు. ఆపై ఆతడు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించి, సుబాహువును సంహరించాడు. ఆ పిదప ‘వాయవ్యాస్త్రాన్ని’ ప్రయోగించి మిగతా రక్కసుల్ని వధించాడు.
యజ్ఞం నిర్విఘ్నంగా ముగిసింది. మునుల ముఖాలు వికసించాయి.
ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087